
గరిమా కుమారుడికి అన్నప్రాసన
వర్గల్ క్షేత్రంలో అదనపు కలెక్టర్
దంపతుల పూజలు
వర్గల్(గజ్వేల్): అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, పల్లవ్ దంపతులు శుక్రవారం సాయంత్రం వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం సందర్శించారు. అమ్మవారి సన్నిధిలో తమ కుమారుడు రిశాన్‌కు శాస్త్రోక్తంగా అన్నప్రాసన జరిపించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, వేదపండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం వేదపండితులు దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు.
ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం
పుట్టినరోజును పురస్కరించుకుని
ప్రత్యేక పూజలు
పటాన్‌చెరుటౌన్: తన జన్మదినాన్ని పురస్కరించుకుని ముంబైలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయకుడిని శుక్రవారం కాంగ్రెస్ నేత నీలం మధుముదిరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ... తమ కోరికలు తీర్చుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులవుతారన్నారు. ప్రతీ గణేశ్ దేవాలయాల్లో వినాయకుడికి తొండం ఎడమవైపు ఉంటుందని కానీ ఈ దేవాలయంలో మాత్రం తొండం కుడి వైపు ఉండటంతోపాటు తొండంలో మూడో కన్ను ఉంటుందన్నారు. ఇంతటి ప్రత్యేకతలు ఉన్న సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయన్నారు. సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఏళ్లుగా తనకు అలవాటని అందులో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్నానన్నారు. ఆ సిద్ధి వినాయకుడు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.

గరిమా కుమారుడికి అన్నప్రాసన
Comments
Please login to add a commentAdd a comment