
సచిన్ డబుల్ ధమాఖా..
● గ్రూప్– 2లో రెండు..
● గ్రూప్–3లో 23వ ర్యాంక్
సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణానికి చెందిన వడ్లకొండ సచిన్‌రెడ్డి డబుల్ ధమాఖా సాధించారు. శుక్రవారం విడుదల చేసిన గ్రూప్–3 ఫలితాల్లో 450మార్కులకు 317.15తో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల విడుదలైన గ్రూప్–2లో రెండో ర్యాంక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాక్షితో సచిన్ తన సంతోషం వ్యక్తం చేస్తూ గ్రూప్–1 ర్యాంకింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఏదిఏమైనా సివిల్స్ సాధించాలని ఉందని తన లక్ష్యం మరోసారి గుర్తు చేశారు.
సత్తాచాటిన తొగుట యువకుడు
తొగుట(దుబ్బాక): గ్రూప్–3 ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ సత్తాచాటారు. టీఎస్‌పీఎస్సీ శనివారం ఫలితాలు విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం శ్రీకాంత్ హెచ్‌ఎండీఏలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
వచ్చే నెల 20 నుంచిఓపెన్ పరీక్షలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు వచ్చే నెల 20 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు టెన్త్, ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు, ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు తెలిపారు. పరీక్ష రుసుం చెల్లించిన అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు అర్హులన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఫోన్ నంబర్ (80084 03635)ను సంప్రదించాలన్నారు.

సచిన్ డబుల్ ధమాఖా..
Comments
Please login to add a commentAdd a comment