జాతీయస్థాయి పోటీలో రాణించిన హంసిని
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యార్థిని లక్ష్మీహంసిని ప్రథమ స్థానంలో నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్‌కుమార్ అన్నారు. శనివారం హంసినిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో అన్ని పోటీలలో రాణించవచ్చని, ఐదో తరగతి విద్యార్థిని లక్ష్మీహంసిని నిరుపించారని పేర్కొన్నారు.
వెనుకబడిన పిల్లలకుఏఐ ద్వారా బోధన
– డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
జగదేవ్‌పూర్(గజ్వేల్): విద్యాపరంగా వెనుకబడిన పిల్లలకు కృత్రిమ మేధ సహాయంతో బోధన అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మండలంలోని వట్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో మాత్రమే ఉపయోగిస్తున్న ఈ ఏఐ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలో ప్రవేశపెట్టేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ మాధవరెడ్డి, ప్రధానోపాధ్యాయులు కనకయ్య, సరోజ, ఉపాధ్యాయులు శ్రీనివాస్, పరశురాములు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షల్లో
ఇద్దరు డిబార్
సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. శనివారం ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు కాపీ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దౌల్తాబాద్‌లో ఒకరు, బెజ్జంకిలో మరొకరు పట్టుబడ్డారు. జిల్లాలోని 43 పరీక్ష కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ మొత్తం 8,050 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 296 మంది వివిధ కారణాల చేత పరీక్షకు గైర్హాజరు అయ్యారు. 7,754 మంది విద్యార్థులతో 96శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఎంఆర్‌పీ ధర కంటే
ఎక్కువ ఇవ్వొద్దు
జిల్లా లీగల్ సర్వీసెస్ అఽథారిటీ
కార్యదర్శి స్వాతిరెడ్డి
సిద్దిపేటరూరల్: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అఽథారిటీ కార్యదర్శి ఎస్.స్వాతిరెడ్డి అన్నారు. శనివారం నారాయణరావుపేటలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వాతిరెడ్డి మాట్లాడారు. దుకాణాల నుంచి ఎలాంటి వస్తువులు కొన్నా వాటిని పరిశీలించిన తర్వా తనే ఎంఆర్‌పీ డబ్బులు చెల్లించాలని చెప్పారు. ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దానిపై ఉన్న ప్రతీ అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. కాలపరిమితి, ఇతర సమస్యలు ఉంటే వెంటనే కంపెనీ వారికి సమాచారం అందించవచ్చన్నారు. ఎటువంటి వివరాలు లేని వస్తువులను కొనకూడదని తెలిపారు. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని, వస్తువు సంబంధిత బిల్లును కూడా తీసుకోవాలని సూచించారు. వినియోగదారుడికి ఎలాంటి సమస్య ఉన్న వినియోగదారుల కోర్టులో ఉచితంగా కేసు వేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ అపూర్వరెడ్డి, ఎంపీడీఓ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కాంగ్రేస్ నాయకులు కరుణాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment