
బీఆర్‌ఎస్ కార్యకర్తల కూలి పనులు
నంగునూరు(సిద్దిపేట): బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారం గట్లమల్యాలలో కూలి పనులు చేశారు. గ్రామానికి చెందిన బుద్ది తిరుపతి చేనులో బస్తాలు మోయగా రూ.5వేలు, అలాగే పుట్ట మధు రూ.5వేలు అందజేశారు. కార్యక్రమంలో వేణుగోపాలచారి, ప్రకాశ్‌రెడ్డి, బాబు, వెంకటయ్య, శ్రీనివాస్, వెంకటేశ్, భిక్షపతి, పరశురాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న ఆలయంలో పూజలు
కొమురవెల్లి(సిద్దిపేట): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు పిడిశెట్టి రాజు కొమురవెల్లి మల్లన్న ఆయలంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గొప్పనాయకుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని చెప్పారు. సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.