
అర్జీలు సత్వరం పరిష్కారం
సిద్దిపేటరూరల్: ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు అందిస్తున్న బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలు పునరావతం కాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. మొత్తం 44 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, డీఆర్డిఓ జయదేవ్ ఆర్య, ఏఓ అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.