
పండుగకు ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త
సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఇంటికి తాళం వేసి ఊరెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ అనురాధ సూచించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో దొంగతనాలు జరగకుండా రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నామన్నారు. సీసీ కెమరాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు సహకరించాలన్నారు. శివారు కాలనీలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తం కావాలన్నారు. ఖరీదైన వస్తువులు, బంగారం, నగదు ఇంట్లో ఉంచి ఇంటికి తాళం వేయకూడదని, బ్యాంకు లాకర్‌లో భద్రపర్చాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
తొగుట(దుబ్బాక): గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా దుబ్బాక నీటిపారుదల శాఖ డీఈఈ చెన్ను శ్రీనివాస్‌రావు, తొగుట సీఐ ఎస్‌కే లతీఫ్‌లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. హైదరాబాద్‌లో ఆశా గీతాంజలి వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివారం ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి వేదిక ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అందజేశారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కురుమలు కేవలం ఉద్యోగాల్లోనే కాకుండా వ్యాపారం, రాజకీయాలలో రాణించాలని కురుమ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి రవికాంత్ అన్నారు. సంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు కంతుల రాములు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పోతుగంటి రవికాంత్, ప్రధాన కార్యదర్శిగా వాసూరి శ్రీకాంత్, కోశాధికారిగా బండారి మల్లేశం, ఉపాధ్యక్షులుగా ఏలేటి రమేష్, బట్టు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా కంతుల లక్ష్మణ్, కోల్పుల రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా కంతుల శ్రీశైలం, అంజయ్య, దేవరాజులు వ్యవహరించారు. కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు రవికాంత్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
దుబ్బాకటౌన్: రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించింది. దీంతో వారి కుటుంబ సభ్యులను ఆదివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. అధైర్య పడవద్దని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజిరెడ్డి, ఇప్ప దయాకర్, రామచంద్రం గౌడ్, భార్గవ్, లక్ష్మారెడ్డి, నందు తదితరులున్నారు.

పండుగకు ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త

పండుగకు ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త

పండుగకు ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త