
సాధారణంగా శునకాలు వీధుల్లో కనిపించే పాడైపోయిన బొమ్మలు, ప్లాస్టిక్‌కవర్లు, వస్తువులతో ఆడుకుంటాయి. ఒకదానికొకటి పోటీపడి మరీ లాక్కోవడానికి ప్రయత్నిస్తాయి. అచ్చం అలాంటి ఓ వీడయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఏ పేజీ తో మేక్ యూ స్మైల్ అగైన్’ అనే ట్విటర్ ఖాతా ఈ వీడియోను పోస్ట్ చేసింది. ‘మీ అందరికీ ఒకక్షణం శాంతి, మీ సాయంత్రానికి కొంత ప్రశాంతతను ఈ వీడియో కలిగిస్తుందని ఆశిస్తున్నాం’ అని అంటూ కామెంట్ జతచేసింది. సముద్ర తీరంలో రెండు కుక్కలు ఓ బెలూన్‌ను తమ తలతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ పైపైకి తోస్తాయి.
ఫుట్‌బాల్ ఆటగాళ్లు బంతిని తమ తలతో కొట్టినట్లు శునకాలు కూడా ఆ బెలూన్‌కు వాటి తలతో కొట్టడంతో అది పైకి ఎగురుతుంది. బెలూన్‌ను పైకి తోసుకుంటూ సముద్రం నీటిలోకి వెళ్లుతాయి. సూర్యుడు అస్తమిస్తున్న అందమైన సాయంకాలం సమయంలో సముద్ర తీరంలో కుక్కలు బెలూన్‌తో సరదాగా ఆడుకుంటున్న వీడియో నెటిజన్లును ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది నెటిజన్లు వీక్షించగా వేల సంఖ్యలో కామెంట్లు చేస్తున్నారు. ‘చాలా అద్భుతంగా ఉంది’, ‘ఇలాంటి వీడియోలు చూస్తే మనసు చాలా సంతోషంగా ఉంటుంది’, ‘ఈ వీడియోను అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment