Asia Cup, 2023- Pakistan vs India: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో ఆసియా కప్-2023 ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది టీమిండియా. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా శనివారం (సెప్టెంబరు 2) దాయాదుల మధ్య పోరు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆతిథ్య దేశానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆసియా కప్ హెడ్‌షాట్స్ సెషన్ పేరిట నిర్వహించిన ఫొటోషూట్‌లో భారత ఆటగాళ్లు పాల్గొన్నారు.
ఫొటోషూట్‌లో సరదాగా టీమిండియా ఆటగాళ్లు
ఈ వన్డే కప్ టోర్నీలో టీమిండియాకు సారథ్యం వహించనున్న కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సహా ఆటగాళ్లంతా ఫొటోలకు తమదైన శైలిలో ఫొజులిచ్చారు. ఇక ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లు ఫొటోషూట్ సమయంలో ఒకరినొకరు ఆటపట్టిస్తూ సరదాగా గడిపారు.
ఎట్టకేలకు భయ్యా క్యాప్ తీశాడు
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌లో షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. ఫొటోషూట్ సందర్భంగా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. సీనియర్ మహ్మద్ షమీని ఉద్దేశించి ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఇప్పటికైనా భయ్యా క్యాప్ తీశాడంటూ సంతోషం వ్యక్తం చేశాడు.
‘‘మేము శ్రీలంక చేరుకున్నాం. ఆసియా కప్-2023 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈరోజు హెడ్‌షాట్ సెషన్ చాలా సరదాగా సాగింది. జస్సీ సర్(జస్‌ప్రీత్ బుమ్రా) ఎలా ఉన్నారో మీరే చూడండి. ఇక మా షమీ భాయ్ ఎట్టకేలకు ఈరోజు తన క్యాప్ తీశారు.
మహ్మద్ షమీ(PC: BCCI)
ఇటీవలే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఫొటోషూట్ కోసం తన లుక్ రివీల్ చేశారు. నాకైతే అన్నింటికంటే ఇదే చాలా సంతోషాన్నిచ్చింది’’ అని సిరాజ్ సరదాగా కామెంట్ చేశాడు. కాగా షమీ ఇటీవలే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి లుక్‌ను ఉద్దేశించి సిరాజ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వంలో షమీ, సిరాజ్ సహా ప్రసిద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్‌లతో టీమిండియా పేస్ దళం పటిష్టంగానే కనబడుతోంది. మరి.. పాకిస్తాన్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి!
ఆసియా కప్-2023- భారత జట్టు ఇదే
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.
స్టాండ్ బై: సంజూ శాంసన్.
చదవండి: పాకిస్తాన్‌తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే
Comments
Please login to add a commentAdd a comment