
న్యూఢిల్లీ: ఎప్పటిలాగే ఈ సీజన్ ఐపీఎల్‌లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫేవరెట్ కాదనే అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. ఆర్సీబీ జట్టులో తగినంత బ్యాటింగ్ బలం లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకొచ్చాడు. అసలు ఆర్సీబీలో సరైన బ్యాటింగ్ లైనప్ ఉందా అని ప్రశ్నించాడు. ఈ మేరకు తన యూట్యాబ్ చానల్‌లో ఆర్సీబీ ఫ్రాంచైజీపై స్వాట్( స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్) అనాలిసిస్ చేశాడు చోప్రా.‘ ఆర్సీబీ స్క్వాడ్‌లో బలహీనతలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఇది నిజం. మీరు వేలానికి సరిగా వెళ్లనప్పుడు ఆడటానికి వచ్చేసరికి వెనుకబడే ఉంటారు. సరైన ట్రేడింగ్ విండోస్ ప్రకారం ఆర్సీబీ ముందుకెళ్లలేదు. కనీసం వేలానికి ఎవరిని తీసుకోవాలనే దానిపై కూడా అవగాహన లేకుండా వెళ్లారు. మీరు పూర్తిస్థాయి జట్టుతో ఐపీఎల్‌కు సిద్ధం కాలేదు. (చదవండి: ఎంటర్‌టైన్‌మెంట్ ఫీవర్.. సక్సెస్ ఫియర్)
మీ జట్టులో చాలా లోపాలున్నాయి. ప్రధానంగా బ్యాటింగ్‌లో డెత్ ఓవర్ల వరకూ ఉండే లైనప్ ఉందా?, కోహ్లి, డివిలియర్స్ ఆడితే సరే.. ఒకవేళ వీరిద్దరూ ఆడని పక్షంలో ఆ తర్వాత పరిస్థితి ఏమిటి?, మీ ఇద్దరి తర్వాత బ్యాటింగ్ చేసే సామర్థ్యం జట్టులో ఉందా?,లేదు కదా.. మొయిన్ అలీ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో దూబే, సుందర్‌కు కొద్ది పాటి అనుభవం మాత్రమే ఉంది. దాంతో అలీని బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు దింపాల్సి ఉంటుంది. ఇక క్రిస్ మోరిస్ ఉన్నాడు. ఈ నలుగురు ప్రపంచ ఉత్తమ బ్యాట్స్‌మన్‌లు కాదు. ఇది బ్యాటింగ్‌లో ఆర్సీబీ సమస్య. ఇక బౌలింగ్ విషయానికొస్తే డెత్ ఓవర్ల బౌలింగ్‌లో మోరిస్ డెత్ ఓవర్ల స్పెషలిస్టు కాదు. డేల్ స్టెయిన్‌ను ఆడించినా అతను కూడా డెత్ ఓవర్ల బౌలర్ కాదు. మరి అటువంటప్పుడు డెత్ ఓవర్ల స్పెషలిస్టు ఎవరు?, నవదీప్ సైనీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ నమ్మదగిన బౌలర్లు కూడా కాదు. ఇన్ని సమస్యలు ఆర్సీబీలో ఉన్నాయి. ఈ జట్టుతో ఆర్సీబీ ఎలా నెట్టుకొస్తుందో తెలియడం లేదు’ అని ఆకాశ్ చోప్రా ధ్వజమెత్తాడు.(చదవండి: ‘కోహ్లిని ఔట్ చేయడానికి ఒక్క బాల్ చాలు’)
Comments
Please login to add a commentAdd a comment