
దుబాయ్: ఐపీఎల్-13 వ సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్‌లో కూడా ఇరగదీయాలని చూస్తున్నాడు. యూఏఈ చేరుకున్న తర్వాత అటు బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌పై కూడా కోహ్లి ఫుల్ ఫోకస్ పెట్టాడు. అంతకుముందు జరిగిన ట్రైనింగ్ సెషన్‌లో డైవ్ కొట్టి క్యాచ్ అందుకున్న కోహ్లి.. ఈసారి గాల్లో అమాంతం ఎగిరి క్యాచ్ పట్టేశాడు. ఆర్సీబీ తాజా ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా కోహ్లి ‘సూపర్ మ్యాన్’ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్ గతంలో పట్టిన క్యాచ్ మాదిరిగా ఉంది. (చదవండి: కోహ్లి.. చెప్పడానికి ఏమీ లేదు: ఆర్సీబీ)
2018 ఐపీఎల్ సీజన్‌లో డివిలియర్స్ బౌండరీ లైన్ ఎగిరి క్యాచ్ అందుకోవడం అప్పట్లో బాగా హైలైట్ అయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ గాల్లో ఎగిరి మెరుపులాంటి క్యాచ్‌ను అందుకున్నాడు. ఇప్పుడు కోహ్లి ప్రాక్టీస్ సెషన్‌లోనే ఆ ఫీల్డింగ్ మెరుపులు మెరిపించాడు. ‘ ఏబీ చూశావా.. నా ఫీల్డింగ్’ అని కోహ్లి అన్నట్లు ఉన్న ఈ క్యాచ్ ఫోటోతో ఆర్సీబీ అభిమానులు తెగమురిసిపోతున్నారు. ఆర్సీబీ అయితే కోహ్లి చేసిన ప్రతీదాన్ని క్యాప్చర్ చేస్తూ ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసేస్తుంది. సెప్టెంబర్ మొదటి వారం ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లి డైవ్ కొట్టి క్యాచ్ పట్టిన వీడియోను ఆర్సీబీ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆ వీడియోకు క్యాప్షన్‌ను కాస్త భిన్నంగా పెట్టింది. ‘ కోహ్లి.. ఈ సమయంలో చెప్పడానికి ఏమీ లేదు. వదిలేద్దాం’ అని కోహ్లి డైవ్‌ను కొనియాడింది. సోమవారం ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.(చదవండి: ఐపీఎల్ 2020: ‘త్రీ’ వర్సెస్ ‘ఫోర్’)
Brothers in the air 😃 @ABdeVilliers17 pic.twitter.com/hf0oeB9Z0h
— Virat Kohli (@imVkohli) September 19, 2020
Comments
Please login to add a commentAdd a comment