Photo Courtesy: IPL 2026
సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్‌కెప్టెన్ అభిషేక్ శర్మకు ఐపీఎల్ నిర్వాహకులు షాక్ ఇచ్చారు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించారు. కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో అభిషేక్ అసభ్య పదజాలం వాడినట్లు స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీంతో అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.
మ్యాచ్‌లో ఆట పరంగా అభిమానులను అలరించినప్పటికీ, మైదానంలో మాత్రం అతని ప్రవర్తన అధికారులను నిరాశకు గురిచేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 ప్రకారం (మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం వాడటం) లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు అభిషేక్ అంగీకరించాడు.
ఐపీఎల్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా లెవల్ 1 నేరాలు తక్కువ తీవ్రత కలిగినవిగా పరిగణించబడతాయి. అయినా పదేపదే ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే డీమెరిట్ పాయింట్లు పెరుగుతాయి. వీటివల్ల భవిష్యత్తులో మ్యాచ్ ల నుండి కూడా సస్పెన్షన్ కు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అభిషేక్ తన తప్పును అంగీకరించడంతో రిఫరీ శిక్షను ఖరారు చేశారు.
అరుదైన రికార్డు..
గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులతో సునామి ఇన్నింగ్స్ ఆడాడు. పనిలో పనిగా అభిషేక్ తన ఖాతాలో అరుదైన రికార్డును జమ చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ తరఫున వంద సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు.
ఎస్ఆర్‌హెచ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ (143 సిక్సర్లు) తొలి స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ (101 సిక్సర్లు), క్లాసెన్ (89 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (64 సిక్సర్లు), హెడ్ (50 సిక్సర్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 65 పరుగుల భారీ తేడాతో కేకేఆర్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
🚨 Meet Abhishek Sharma a FAILURE product of IPL 🚨
- Matches: 78
- Runs: 1822
- AVERAGE : 26.79
Strike Rate: 162.39
- Ducks- 3
- Fifties - 9
- Centuries - 1
Look at his average 26.79 which is below average of any player.pic.twitter.com/BjRi1v8aMz— manzur shaban (@Manzurshaban123) April 2, 2026
చదవండి: రనౌటయ్యి బతికిపోయాడు లేదంటేనా!


