
వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు పాకిస్తాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ నసీం షా వరల్డ్‌కప్‌లో పలు మ్యాచ్‌లను దూరమవుతాడని తెలుస్తుంది. ఆసియా కప్-2023లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన నసీం ఆతర్వాత బ్యాటింగ్‌కు కూడా రాలేదు. గాయం తీవ్రమైంది కావడంతో అతను తదుపరి శ్రీలంకతో జరిగిన మ్యాచ్ బరిలోనూ దిగలేదు. పీసీబీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నసీం.. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం నెల రోజుల సమయం పట్టవచ్చని సమాచారం.
ఇదే జరిగితే అతను వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడు. మరోవైపు నసీం షాతో పాటు మరో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ కూడా భారత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. అయితే అతని గాయం అంత తీవ్రమైంది కాకపోవడంతో ప్రపంచకప్‌లో అన్ని మ్యాచ్‌లను అందుబాటులో ఉంటాడు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు పాక్ ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. భారత్‌తో మ్యాచ్ సందర్భంగానే అఘా సల్మాన్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో గాయపడగా, శ్రీలంకతో మ్యాచ్‌కు కొద్ది నిమిషాల ముందు ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ గాయపడ్డాడు.
కీలక ఆటగాళ్లంతా వరుసపెట్టి గాయాల బారిన పడటంతో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓటమిపాలై, ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను (అక్టోబర్ 6) ఢీకొంటుంది. అనంతరం అక్టోబర్ 10న శ్రీలంకతో (హైదరాబాద్), అక్టోబర్ 14న భారత్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment