PC: IPL.com
టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్యా రహానే అంటే టీ20లకు పనికిరాడు, టెస్టు క్రికెట్ మాత్రమే ఆడగలడు అన్న అపోహాలు అందరిలో ఉండేవి. అయితే రహానే ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి ఊహలను తలకిందులు చేశాడు. ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజింక్యా రహానే విధ్వంసం సృష్టించాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రహానే ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అతడు ఫోర్లు, సిక్స్‌లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రహానే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 19 బంతుల్లోనే అందుకున్నాడు. దీంతో ఈ ఏడాది సీజన్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు. ఇక ఓవరాల్‌గా కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రహానే 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 61 పరుగులు చేశాడు
కాగా గతేడాది సీజన్‌లో కేకేఆర్ ప్రాతినిథ్యం వహించిన రహానేను.. ఐపీఎల్-2023కు ముందు కోల్‌కతా ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. అయితే వేలంలోకి వచ్చిన రహానే తొలి రెండు రౌండ్లలో అమ్ముడుపోని రహానేను ఆఖరికి సీఎస్‌కే రూ.50లక్షలకు కొనుగోలు చేసింది. కాగా సీఎస్‌కే తరపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే అతడు అదరగొట్టాడు.
జట్టులో చోటే కాదు.. బీసీసీఐ కాంట్రాక్ట్ కూడా
కాగా రహానే గత కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన అతడిని సెలక్టర్లు పక్కన పెట్టారు. గతేడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో చివరగా అతడు టీమిండియా తరపున ఆడాడు.
అయితే జట్టులో చోటు మాత్రమే కాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా రహానే కోల్పోయాడు. 2023-24 వార్షిక సంవత్సరం గాను బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో రహానే పేరులేదు. అయితే సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన కసితోనే ముంబైపై రహానే విధ్వంసం సృష్టించాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: IPL 2023- Rahane: 34 ఏళ్ల వయస్సులో విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 23 పరుగులు! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment