మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌.. అల్జీరియా సంచలన విజయం | Algeria Victory-Over-Jordan-Thrilling Match FIFA-World-Cup-2026 | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌.. అల్జీరియా సంచలన విజయం

Jun 23 2026 12:02 PM | Updated on Jun 23 2026 12:12 PM

Algeria Victory-Over-Jordan-Thrilling Match FIFA-World-Cup-2026

ఫిఫా ప్రపంచకప్‌లో మరో ఉత్కంఠభరిత పోరు జరిగింది. గ్రూప్‌-జెలో భాగంగా జోర్డాన్, అల్జీరియా మధ్య మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. మ్యాచ్‌లో ఆఖరి పది నిమిషాల్లో గోల్‌ కొట్టిన అల్జీరియా 2-1 తేడాతో జోర్డాన్‌పై సంచలన విజయం సాధించింది. 

అల్జీరియా తరఫున నాధిర్ బెన్‌బొలి (ఆట 69వ నిమిషం), అమినె గౌరి (ఆట 82వ నిమిషం) రెండు గోల్స్ సాధించగా, జోర్డాన్ తరఫున నిజర్ అల్‌-రష్‌దన్ ఆట 36వ నిమిషంలో గోల్ కొట్టాడు. అయితే అల్జీరియా విజయం సాధించినప్పటికీ గోల్ డిఫెరెన్స్‌లో ఆస్ట్రియాతో పోలిస్తే అల్జీరియా (-2) త‌క్కువగా ఉంది.మ్యాచ్‌లో ఓటమితో జోర్డాన్‌ ఆడిన రెండింటిలో పరాజయాలు చవిచూసి ఫిఫా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది.

దీంతో ప‌ట్టిక‌లో మూడో స్థానానికి ప‌రిమిత‌మైంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న అర్జెంటీనా రెండు విజ‌యాల‌తో ఇప్ప‌టికే నాకౌట్ బెర్తును ఖ‌రారు చేసుకోగా, రెండో బెర్తు కోసం ఆస్ట్రియా, అల్జీరియా మ‌ధ్య పోటీ నెల‌కొంది. దీంతో అల్జీరియా, ఆస్ట్రియా మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు నాకౌట్‌కు వెళ్ల‌నుండ‌గా, ఓడిన జ‌ట్టు ఇంటిబాట ప‌ట్ట‌నుంది.

Read: ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement