IPL 2022: Another DC Player Tests Positive For Covid - Sakshi
Sakshi News home page

Covid-IPL 2022: ఢిల్లీ జట్టులో మరో ప్లేయర్‌కు కోవిడ్‌ పాజిటివ్‌..!

Published Wed, Apr 20 2022 5:05 PM | Last Updated on Wed, Apr 20 2022 5:50 PM

Another DC Player Tests Positive For Covid - Sakshi

Another DC Player Tests Positive For Covid: ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేలా లేదు. నిన్నటి వరకు ఆ జట్టులో ఐదుగురు వైరస్‌ బారిన పడగా, తాజాగా మరో ఆటగాడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడిన ఆటగాడు ఎవరన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రముఖ వెబ్‌సైట్‌ కథనం మేరకు మరో విదేశీ ఆటగాడు మహమ్మారి బారిన పడినట్లు సమాచారం. ఢిల్లీ జట్టు ఇవాళ (ఏప్రిల్‌ 20) రాత్రి 7:30 గంటలకు పంజాబ్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉండగా.. మరో కోవిడ్‌ కేసు బయటపడటంతో మ్యాచ్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

వైరస్‌ విస్తరించే అవకాశాలు ఉండటంతో ఇప్పటికే మ్యాచ్‌ వేదికను పూణే నుంచి ముంబైకి షిఫ్ట్‌ చేసిన బీసీసీఐ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఢిల్లీ జట్టులో ప్యాట్రిక్ ఫర్హార్ట్ (ఫిజియో), మిచెల్ మార్ష్ (ప్లేయర్‌), చేతన్ కుమార్ (స్పోర్ట్స్ మసాజ్‌ థెరపిస్ట్), డాక్టర్ అభిజిత్ సాల్వి (టీమ్ డాక్టర్), ఆకాశ్ మానే (సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్)లకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. వీరిలో మిచెల్‌ మార్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఫర్హార్ట్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. 
చదవండి: IPL 2022: ముంబై జట్టులో టీమిండియా బౌలర్‌.. రోహిత్‌ సిఫార్సుతో చోటు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement