మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన భర్త విరాట్ కోహ్లిపై చేసిన వివాదస్పద వ్యాఖలపై నటి అనుష్క శర్మ స్పందించారు. గురువారం ఐపీఎల్-2020లో బాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లితోపాటు, తనపై గవాస్కర్ చేసిన అనుచిత మాటలపై అనుష్క ధీటుగా బదులిచ్చారు. కాగా ఇటీవల కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ ఆటలో విరాట్ తన పేలవమైన ప్రదర్శనతో ఏ మాత్రం రాణించలేకపోయాడు. ఈ క్రమంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్, కామెంట్ చేబుతూ మధ్యలో విరాట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘లాక్‌డౌన్ సమయంలో అనుష్క బౌలింగ్‌ను మాత్రమే కోహ్లి ఎదుర్కొన్నాడు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన అనుష్క.. గవాస్కర్ వ్యాఖ్యలు అగౌరవపర్చేలా ఉన్నయని. భర్త ఆట తీరు గురించి భార్యపై ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. (కోహ్లి ఎందుకిలా చేశావు..)
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో రాసుకొచ్చారు. ‘మిస్టర్ గవాస్కర్, మీ కామెంట్ అసహ్యకరంగా ఉంది. భర్త ఆట గురించి భార్యపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో వివరిస్తే బాగుంటుంది. ఇన్నేళ్లుగా మీరు కమెంటేటర్‌గా వ్యాఖ్యానించేటప్పుడు ప్రతి క్రికెటర్ వ్యక్తిగత జీవితాలను గౌరవించారని నాకు తెలుసు. సరిగ్గా ఇలాగే మాకు(విరాట్, అనుష్క) సమానమైన గౌరవం ఇవ్వాలని మీరు భావించలేదా. నిన్న నా భర్త ఆటతీరు గురించి మాట్లాడానికి మీ మనసులో ఎన్నో పదాలు ఉంటాయని తెలుసు. ఇది 2020 కానీ నా విషయంలో ఏమి మారలేదు. క్రికెట్ విషయంలో నన్ను లాగడం ఎప్పుడు మానుకుంటారు. నాపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం ఎప్పుడు వదిలేస్తారు. గౌరవనీయమైన మిస్టర్ గవాస్కర్, మీరు ఓ లెజెండ్. క్రికెట్‌లో ఎంతో పేరు సంపాదించారు. కేవలం మీ మాటలు విన్నప్పుడు నాకెంత బాధ వేసిందనే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. (కేఎల్ రాహుల్ అరుదైన ఘనత)
మరోవైపు సునీల్ గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దూమరం రేపుతున్నాయి. ఆయన తీరుపై కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గవాస్కర్ చేసిన కామెంటపై విరూష్క అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న ఆయన కాస్తా హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. అంతేగాక కామెంటేటర్ హోదా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. (అమ్మతనానికి మురిసిపోతున్న అనుష్క)
Comments
Please login to add a commentAdd a comment