![Any Effect To IPL By UAE Sees Alarming Increase In Coronavirus Cases - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/20/IPL.jpg.webp?itok=KCPzL_4Y)
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్ సెస్టెంబర్19 నుంచి దుబాయ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 13 సీజన్ ప్రారంభానికి ఇంకా నెలరోజులే గడువు ఉండడంతో లీగ్‌లో పాల్గొనేందుకు అన్ని జట్లు సమాయత్తమవుతున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గురువారం ఉదయం దుబాయ్‌కు బయలుదేరగా.. మిగతా జట్లు కూడా త్వరలోనే దుబాయ్‌కు చేరుకోనున్నాయి. అయితే కొద్ది రోజులుగా యూఏఈలో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కానీ గడిచిన 24 గంటల్లో 365 కొత్త కేసలు నమోదవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. (ప్రేయసి పోస్టుపై కేఎల్ రాహుల్ కామెంట్..)
ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా నెలరోజులే మిగిలి ఉన్న ఈ సమయంలో ఆ దేశంలో కరోనా కేసులు పెరగడం కొంచెం ఇబ్బందిగా మారింది. ఒకవేళ కేసులు అనూహ్యంగా పెరిగితే ఐపీఎల్ పరిస్థితి ఏంటని కొన్ని వర్గాల్లో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. కాగా ఇప్పటివరకు యూఏఈలో 64,906 కేసులు నమోదు కాగా.. 366 మరణాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా జరగనున్న మ్యాచ్‌లు బయో సెక్యూర్ పద్దతిలో నిర్వహించనున్నారు.
అంతేగాక లీగ్‌లో పాల్గొనబోతున్న ఆటగాళ్లందరికి కఠిన నిబంధనలు వర్తింపజేయనున్నారు. ప్రతీ ఆటగాడికి రెండు సార్లు కరోనా టెస్టులు అయ్యాకే అనుమతించనున్నారు. కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వస‍్తేనే విమానం ఎక్కేందుకు పర్మిషన్ ఇవ్వనున్నారు. మ్యాచ్ గెలిచినా.. ఓడినా.. ఆటగాళ్ల మధ్య ఎలాంటి షేక్ హ్యాండ్స్‌కు తావులేదు. కాగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్ నవంబర్ 10 వరకు జరగనుంది.(‘చనిపోయే ముందు ఆ సిక్సర్ చూడాలనుంది’)
Comments
Please login to add a commentAdd a comment