దుబాయ్ : చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆ జట్టు యాజమాన్యం శుభవార్తను అందించింది. ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డ 13 మంది కోలుకున్నారని తెలిపింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారందరికీ కరోనా నెగిటివ్‌గా వచ్చిందని సీఎస్‌కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా చెన్నై జట్టులోని ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు మరో 11 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో జట్టు యాజమాన్యంతో పాటు ఐపీఎల్ నిర్వహకులు తీవ్ర ఆందోళన చెందారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న సీఎస్‌కే తొలి మ్యాచ్ ఆడనుంది. (రైనాకు ఎప్పుడైనా అండగా ఉంటాం)
మిగతా జట్లన్నీ క్వారెంటైన్ పూర్తి చేసుకుని మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. కరోనా కారణంగా చెన్నై ఆటగాళ్లు మాత్ర ఇంకా హోటల్ గదులకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ జట్టు ప్రారంభ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేదని, షెడ్యూల్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని వార్తులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా బారినపడ్డ ఆటగాళ్లంతా కోలుకున్నారని జట్టు సీఈఓ ప్రకటించడం కొంత ఊరట కలిగిస్తోంది. త్వరలోనే చెన్నై ప్లేయర్లు ప్రాక్టీస్‌ను సైతం ప్రారంభించే అవకాశం ఉంది. (రైనాను సీఎస్‌కే వదులుకున్నట్లేనా..!)
Comments
Please login to add a commentAdd a comment