
న్యూఢిల్లీ: కరోనా భయాలతో అల్లాడిపోతున్న జనానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రూపంలో కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది. ఎన్నో తర్జనభర్జనల అనంతరం ఖరారైనా ఐపీఎల్ 2020 వేడుక ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. యూఏఈ వేదికగా జరగనున్న డ్రీమ్ 11 ఐపీఎల్‌లో.. సెప్టెంబర్ 19న అబుదాబిలో ముంబై వర్సెస్ చెన్నై మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 20న దుబాయ్‌లో ఢిల్లీ వర్సెస్ పంజాబ్, 21న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు, 22న రాజస్థాన్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, 23న కోల్‌కతా వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 3 వరకు ఐపీఎల్ 13 వ సీజన్ కొనసాగుతుంది.
(చదవండి: 'స్నేహం పక్కన పెట్టి ఆడితే బాగుంటుంది')
మ్యాచ్‌ల పూర్తి జాబితా
(చదవండి: పృథ్వీ షా.. నీ ప్రతిభ అమోఘం)
Comments
Please login to add a commentAdd a comment