ఓటమి ఎరుగని అర్జెంటీనా.. మెస్సీ ప్రపంచ రికార్డు | Argentina Beat Jordan-Becomes-Group Topper-Enters Knock Out-FIFA WC | Sakshi
Sakshi News home page

ఓటమి ఎరుగని అర్జెంటీనా.. మెస్సీ ప్రపంచ రికార్డు

Jun 28 2026 9:50 AM | Updated on Jun 28 2026 11:13 AM

Argentina Beat Jordan-Becomes-Group Topper-Enters Knock Out-FIFA WC

ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా లీగ్ దశను ఓటమన్నదే లేకుండా అజేయంగా ముగించింది. గ్రూప్‌-జెలో భాగంగా జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-1 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అర్జెంటీనా తరఫున గివాని సెల్సో (19వ నిమిషం), లుటారో మార్టినేజ్ (31వ నిమిషం), లియోనల్ మెస్సీ (80వ నిమిషం)లో గోల్స్ సాధించగా, జోర్డాన్ తరఫున ముసా అల్ తమారీ (55వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. 

లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన అర్జెంటీనా 9 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నాకౌట్‌కు అర్హత సాధించింది. అర్జెంటీనాతో పాటు ఆస్ట్రియా, అల్జీరియా కూడా తదుపరి రౌండ్‌కు చేరుకోగా, ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన జోర్డాన్ ఇంటిబాట పట్టింది. ఇక నాకౌట్‌లో మెస్సీ సేన తొలిసారి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో రౌండ్ ఆఫ్ 32కు చేరిన కేప్ వెర్డెతో పోరుకు సిద్ధ‌మైంది. 

ఈ మ్యాచ్‌ ద్వారా లియోనల్‌ మెస్సీ మరో రికార్డు సాధించాడు. జోర్డాన్‌తో మ్యాచ్‌లో గోల్ కొట్ట‌డం ద్వారా మెస్సీ వ‌రుసగా ఏడు ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన తొలి ఆట‌గాడిగా రికార్డులకెక్కాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో మెస్సీకి ఇది ఆరో గోల్ కావ‌డం విశేషం. ఆరు గోల్స్‌తో మెస్సీ గోల్డెన్ బూట్ రేసులో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా, ఫ్రాన్స్ సంచ‌ల‌నం ఎంబాపె 4 గోల్స్‌తో అత‌డిని అనుస‌రిస్తున్నాడు. తాజా గోల్‌తో మెస్సీ ఫిఫా గోల్స్ సంఖ్య 19కి చేరుకుంది. 

ఆట 60వ నిమిషంలో మైదానంలోకి అడుగుపెట్టిన మెస్సీ 83వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. జోర్డాన్‌ జట్టుతో పాటు గోల్‌ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ మెస్సీ కొట్టిన గోల్‌ హైలైట్‌గా నిలిచింది. మెస్సీ కొట్టిన గోల్‌ను చూసి జోర్డాన్‌ గోల్‌కీపర్‌ ఆశ్చర్యపోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: భూకంప విలయం.. కన్నపేగు కోసం ఫుట్‌బాలర్‌ భార్య ప్రాణత్యాగం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement