ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రేపు జరగనున్న క్వార్టర్ ఫైనల్లో మెస్సీ సేన స్విట్జర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. స్విట్జర్లాండ్‌పై విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లాలని అర్జెంటీనా జట్టు భావిస్తోంది.
ఈ సంగతి పక్కనబెడితే క్వార్టర్స్‌లో రిఫరీ సానుకూల నిర్ణయాలతో తమను చీట్ చేసి గెలిచిందని ఈజిప్ట్ ఫిఫాకు ఫిర్యాదు చేసింది. ఇది ఫిక్సింగ్ కిందకు వస్తుందని, దీనిపై విచారణ చేపట్టాలని కూడా ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఫిఫాను కోరింది. ఈ నేపథ్యంలోనే అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోని తమ జట్టుపై వస్తున్న ఆరోపణలపై తొలిసారి స్పందించాడు.
ఇప్పటిదాకా బయటే వినిపించిన ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు ఆటగాళ్ల దాకా కూడా వచ్చాయని తెలిపాడు. అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ గెలవకూడదనే ఉద్దేశంతోనే కొందరు గిట్టనివాళ్లు చేస్తున్న తప్పుడు ఆరోపణలను తాము పట్టించుకోమని కుండబద్దలు కొట్టాడు.
లియోనల్ స్కలోని మాట్లాడుతూ.. ‘అర్జెంటీనా గెలవకూడదని కోరుకోవడం ఇదేమి కొత్త కాదు. 1986 ఫిఫా ప్రపంచకప్ సమయంలోనూ అర్జెంటీనాపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. కానీ అప్పటి మారడోనా బృందం ఇలాంటి వాటిని బేఖాతరు చేయకుండా ఒక చాంపియన్ ఆటను ప్రదర్శించి రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది.
ఈజిప్ట్ ఆరోపిస్తున్నట్లుగా రెండో అర్ధభాగంలో వాళ్లు కొట్టిన గోల్‌ను రద్దు చేయడానికి ముందే వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) ఫుటేజీని క్లియర్‌గా పరిశీలించారు. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే నిర్దేశించిన నియమాలను మాత్రమే వీఏఆర్ బృందం పాటిస్తోందని' లియోనల్ స్కలోని పేర్కొన్నాడు.
ఇక ఫిఫా 2026లో అర్జెంటీనా చాంపియన్ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 8 గోల్స్, ఒక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు!


