ఇంగ్లండ్‌తో సిరీస్ ఓట‌మి.. తొలి వేటు అత‌డి మీదేనా? | BCCI To Evict Key Figure Gautam Gambhir Support Staff Pays Price | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో సిరీస్ ఓట‌మి.. తొలి వేటు అత‌డి మీదేనా?

Jul 11 2026 10:40 AM | Updated on Jul 11 2026 11:13 AM

BCCI To Evict Key Figure Gautam Gambhir Support Staff Pays Price

టీమిండియా ప్ర‌స్తుతం గ‌డ్డుప‌రిస్థితులు ఎదుర్కొంటుంది. నాలుగు నెల‌ల క్రితం పొట్టి ఫార్మాట్‌లో మూడోసారి చాంపియ‌న్‌గా నిలిచిన టీమిండియా ఇప్పుడు మాత్రం వ‌రుస ఓట‌ములు చ‌విచూస్తోంది. ఐర్లాండ్‌తో సిరీస్ ఓడిపోయి ప‌రువు పోగొట్టుకున్న భార‌త జ‌ట్టు ఇప్పుడు ఇంగ్లండ్ గ‌డ్డ‌పై కూడా మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 0-3తో  సిరీస్‌ను కోల్పోయింది. 

ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓట‌మితో బీసీసీఐ కోచింగ్ స్టాఫ్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ విష‌యంలో ఇప్పటికే తీవ్ర అసంతృత్తితో ఉన్న బీసీసీఐ అత‌డిని తొల‌గించ‌డానికి ముందు కోచింగ్ జ‌ట్టును ప్ర‌క్షాళ‌న చేయాల‌ని చూస్తోంది. ఈ మేరకు గంభీర్ టీంలో కీల‌కంగా ఉన్న వ్య‌క్తుల‌ను త‌ప్పించే యోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే స‌పోర్ట్ స్టాఫ్‌లో ఒక వ్య‌క్తిని పదని నుంచి తొలగించాలని చూస్తున్న బీసీసీఐకి ఒక వార్త అందింది. గంభీర్‌ కోచింగ్ స్టాఫ్‌లో ఒక కీలక వ్య‌క్తి తనంతట తానుగా బయటికి వెళ్లినట్లు సమాచారం. అయితే ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నే వివ‌రాలు మాత్రం ఇంకా బ‌య‌టికి రాలేదు. మరి స‌ద‌రు వ్య‌క్తి నిష్క్ర‌మ‌ణ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనా లేక త‌న పాత్ర‌కు న్యాయం చేయ‌క‌పోవ‌డంతో త‌ప్పుకున్నాడా అనేది స్ప‌ష్టంగా తెలియ‌దు.  

మొత్తానికి రెండు వరుస సిరీస్‌ ఓటములు టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇక నేడు సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా చివరి టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి వైట్‌వాష్‌ గండం నుంచి బయటపడాలని శ్రేయస్‌ అయ్యర్‌ సేన భావిస్తోంది.

ఇప్ప‌టికే ఆసియా గేమ్స్‌తో పాటు జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అత‌డి స్థానంలో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలోని కోచింగ్ స్టాఫ్‌ను పంపించేందుకు బీసీసీఐ క‌స‌ర‌త్తులు చేస్తోంది. దీంతో గంభీర్‌తో పాటు అత‌డి స‌పోర్ట్ స్టాఫ్‌పై కూడా త్వ‌ర‌లో వేటు ప‌డే అవ‌కాశముంది. 

చదవండి: వింబుల్డన్‌లో ఓటమి.. రిటైర్మెంట్‌పై జకోవిచ్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement