బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విజయంలో శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్‌లది కీలకపాత్ర. 74 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిన టీమిండియాను ఈ ఇద్దరు 71 పరుగుల భాగస్వామ్యంతో గెలిపించారు. ఈ నేపథ్యంలోనే టెస్టు క్రికెట్‌లో అయ్యర్, అశ్విన్‌లు ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
ఎనిమిదో వికెట్‌కు 71 పరుగులు జోడించిన అయ్యర్, అశ్విన్‌లు టీమిండియా తరపున ఒక టెస్టులో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో లాలా అమర్‌సింగ్- లాల్ సింగ్ జోడి ఉంది. 1932లో ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో ఈ జోడి ఎనిమిదో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. టీమిండియాకు ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇక మూడోస్థానంలో కపిల్ దేవ్-లక్ష్మణ్ శివరామకృష్ణన్ జోడి ఉంది. 1985లో శ్రీలంకతో టెస్టులో ఈ జోడి ఎనిమిదో వికెట్‌కు 70 పరుగులు జోడించారు.
A crucial 71-run stand to win the Test 🤝
— ESPNcricinfo (@ESPNcricinfo) December 25, 2022
R Ashwin and Shreyas Iyer stamped their authority with the bat in Mirpur 👏 #BANvIND
Comments
Please login to add a commentAdd a comment