Asia Cup 2022: Will Rishabh Pant Get Chance To Play In Super 4 Stage - Sakshi
Sakshi News home page

Asia Cup 2022 Super 4: పంత్‌పై మళ్లీ వేటు తప్పదా..?

Published Thu, Sep 1 2022 7:43 PM | Last Updated on Thu, Sep 1 2022 9:04 PM

Asia Cup 2022: Will Rishabh Pant Get Chance To Play In Super 4 Stage - Sakshi

టీమిండియా యువ కిషోరం రిషబ్‌ పంత్‌.. ఆసియా కప్‌ 2022 టోర్నీకి రెగ్యులర్‌ వికెట్‌కీపర్‌గా ఎంపికైనప్పటికీ జట్టు సమతూకం కోసం ఫినిషర్‌ కోటాలో వెటరన్‌ వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ వరుస అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే‌. ఈ కారణంగానే పాక్‌తో మ్యాచ్‌కు పంత్‌ను పక్కకు పెట్టిన జట్టు యాజమాన్యం.. ఆతర్వాత హాంగ్‌కాంగ్‌తో మ్యాచ్‌కు అవకాశం కల్పించినప్పటికీ అతడికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. 

సూపర్‌-4 దశ మ్యాచ్‌లకు ముందు హార్ధిక్‌ పాండ్యా గాయాల బారిన పడకూడదనే ఉద్దేశంతోనే హాంగ్‌కాంగ్‌పై పంత్‌కు అవకాశం కల్పించినట్లు జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే స్వయంగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సూపర్‌-4 మ్యాచ్‌లకు, ముఖ్యంగా పాక్‌ లాంటి జట్టుతో మళ్లీ తలపడాల్సి వస్తే పంత్‌కు అవకాశం కల్పిస్తారా లేక హార్ధక్‌ ఎంట్రీతో అతన్ని మళ్లీ బెంచ్‌కే పరిమితం చేస్తారా అన్న డిస్కషన్‌ ప్రస్తుతం ‍క్రికెట్‌ వర్గాల్లో జోరుగా సాగుతుంది.   

నెట్టింట ఈ టాపిక్‌పై భారీ డిబేట్లు నడుస్తున్నాయి. పంత్‌కు తప్పక అవకాశం ఇవ్వాల్సిందేనని కొందరు వాదిస్తుంటే.. లేదు డీకేను కొనసాగించడమే జట్టుకు శ్రేయస్కరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనలు పక్కన పెడితే.. సూపర్‌-4 దశలో డీకేను కాదని పంత్‌కు అవకాశం కల్పించడం లేక ఇద్దరిని జట్టులోకి తీసుకోవడం దాదాపుగా సాధ్యపడకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఎందుకంటే, సూపర్‌-4 దశలో టీమిండియా.. దెబ్బతిన్న దాయాది పాక్‌ను మరోసారి ఢీకొట్టాల్సి రావొచ్చు. అలాగే, బంగ్లాదేశ్‌, శ్రీలంక లాంటి జట్లకు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌తో కూడా తలపడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో డీకేను పక్కకు పెట్టి పంత్‌కు అవకాశం కల్పించే సాహసం టీమిండియా చేయకపోవచ్చు. అలాగని ఇ‍ద్దరినీ జట్టులోకి తీసుకుంటే, అది బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌పై ప్రభావం కూడా చూపవచ్చు. దీంతో పంత్‌ మరోసారి బెంచ్‌కు పరిమితం కాక తప్పదని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.
చదవండి: టీమిండియాను మరోసారి ముందుండి నడిపించనున్న సచిన్‌ టెండూల్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement