సెంచ‌రీ బాదిన ఆసీస్ బ్యాట‌ర్‌.. భార‌త్ ముంగిట భారీ ల‌క్ష్యం | AUS-A-Woman Batter Century-Set-363 Runs-Target-IND-A-Women | Sakshi
Sakshi News home page

సెంచ‌రీ బాదిన ఆసీస్ బ్యాట‌ర్‌.. భార‌త్ ముంగిట భారీ ల‌క్ష్యం

Sep 25 2026 5:25 PM | Updated on Sep 25 2026 9:14 PM

AUS-A-Woman Batter Century-Set-363 Runs-Target-IND-A-Women

Photo Credit: Twitter

మొహ‌లీ వేదిక‌గా ఇండియా-ఎ వుమెన్‌తో జ‌రుగుతున్న అన‌ధికారిక మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియా వుమెన్ భారీ స్కోరు సాధించింది. చార్లీ నాట్ (70 బంతుల్లో 109; 12 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) సెంచ‌రీతో విధ్వంసం సృష్టించ‌గా, కౌర్ట్నీ వెబ్ (92 బంతుల్లో 95) రాణించ‌డంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 362 ప‌రుగులు చేసింది. 

మిగ‌తా బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ తాహిలా విల్స‌న్ (38), రాచెల్ త్రినెమ‌న్ (29) ప‌ర్వాలేద‌నిపించారు.  చివ‌ర్లో హేలీ సిల్వ‌ర్ హోమ్స్ (8 బంతుల్లో 19 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌డంతో ఆస్ట్రేలియా 360 ప‌రుగుల మార్క్‌ను దాటింది. భార‌త బౌల‌ర్ల‌లో వైష్ణ‌వి శ‌ర్మ, నికీ ప్రసాద్‌ చెరో 4 వికెట్లు పడగొట్టారు.

కాగా మూడో వికెట్‌కు చార్లీ నాట్‌, కౌర్ట్నీ వెబ్ 116 బంతుల్లో 166 ప‌రుగులు జోడించి ఆసీస్ భారీ స్కోరు సాధించ‌డంలో స‌హాయ‌ప‌డ్డారు. కాగా ఇరుజ‌ట్లు చెరో వ‌న్డే గెలిచి 1-1తో స‌మంగా ఉన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement