ఆస్ట్రేలియా ఆటగాళ్లకు టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్స్ ఎవరనే ప్రశ్న ఎదురైనప్పుడు ఆసక్తికర సమాధానలు చెప్పారు. ఆసీస్ స్టార్ ప్లేయర్లంతా ముక్తకంఠంతో ఇద్దరు యువ ఆటగాళ్లకు ఓటు వేశారు. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్ యశస్వి జైస్వాల్‌కు ఓటు వేయగా.. కెమరూన్ గ్రీన్, ట్రవిస్ హెడ్ శుభ్‌మన్ గిల్‌వైపు మొగ్గు చూపారు.
Australian players picking the future Superstars of Indian Cricket. 🇮🇳
- Gill 🤝 Jaiswal...!!!!! pic.twitter.com/RSOzYQOA2k— Johns. (@CricCrazyJohns) September 16, 2024
కాగా, టీమిండియా త్వరలో (నవంబర్ 22 నుంచి) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. టీమిండియా గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు ఆ జట్టును చిత్తుగా ఓడించింది.
దీంతో ఈసారి ఎలాగైనా టీమిండియాకు ఓటమి రుచి చూపించాలని ఆసీస్ ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. మరోవైపు భారత్ జట్టు గతంలో కంటే ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. ఈసారి టీమిండియాను ఓడించడం అంత సులువైన పని కాదు. సీనియర్లు, జూనియర్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆస్ట్రేలియా, టీమిండియా వేర్వేరు జట్లతో సిరీస్‌లలో బిజీగా ఉన్నాయి. త్వరలో భారత్.. బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుండగా.. ఆసీస్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27న మొదలవుతుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.
తొలి టెస్ట్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: గిల్, పంత్, బుమ్రాలకు విశ్రాంతి..?
Comments
Please login to add a commentAdd a comment