ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచ‌ల‌న విజ‌యం | Bangladesh Beaten Australia First Time In T20 International Match | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచ‌ల‌న విజ‌యం

Published Tue, Aug 3 2021 10:58 PM | Last Updated on Wed, Aug 4 2021 1:32 AM

Bangladesh Beaten Australia First Time In T20 International Match - Sakshi

ఢాకా: ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన బంగ్లాదేశ్‌... మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. షకీబ్‌ (36; 3 ఫోర్లు), నయీమ్‌ (30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. హాజల్‌వుడ్‌ 3, స్టార్క్‌ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత ఆసీస్‌ 20 ఓవర్లలో 108 పరుగుల వద్ద ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (45; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేయగా మిగతా వారంతా మూకుమ్మడిగా చేతులెత్తేశారు. బంగ్లాదేశ్‌ బౌలర్‌ నసుమ్‌ అహ్మద్‌ 4 వికెట్లు పడగొట్టగా... ముస్తఫిజుర్‌ రహ్మాన్, ఇస్లామ్‌ చెరో 2 వికెట్లు తీశారు. నేడు ఇదే వేదికపై రెండో టి20 జరుగుతుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement