ఐపీఎల్‌ ప్రత్యర్ది లీగ్‌కు భారత్‌ ఆతిథ్యం..? | BCCI Involved In A Historic Deal For New League In India Apart From IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ప్రత్యర్ది లీగ్‌కు భారత్‌ ఆతిథ్యం..?

Apr 1 2026 6:29 PM | Updated on Apr 1 2026 7:14 PM

BCCI Involved In A Historic Deal For New League In India Apart From IPL

ఐపీఎల్‌ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతున్న వేళ, బీసీసీఐ ఓ సంచలన నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తమ ఆథ్వర్యంలో నడిచే ఐపీఎల్‌కు ప్రధాన ప్రత్యర్ది అయిన బిగ్‌ బాష్‌ లీగ్‌ (ఆస్ట్రేలియా)ను భారత్‌లో నిర్వహించే (ఆరంభ మ్యాచ్‌) అంశంపై క్రికెట్‌ ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. 

ఈ విషయమై బీసీసీయే స్వయంగా పావులు కదుపుతున్నట్లు క్రికెట్‌ వర్గాలు అంటున్నాయి. ఐపీఎల్‌ ప్రత్యర్ది లీగ్‌ను బీసీసీయే ఎందుకు ఎంకరేజ్‌ చేస్తుందన్న విషయం భారతీయ క్రికెట్‌ అభిమానికి అర్దం కావడం లేదు.

ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌ టామ్‌ మోరిస్‌ ప్రకారం, క్రికెట్‌ ఆస్ట్రేలియా 2026–27 సీజన్‌ తొలి బీబీఎల్‌ మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహించాలని యోచిస్తోంది. ఇప్పటివరకు BBL ఎప్పుడూ విదేశీ నేలపై జరగలేదు. ఇది జరిగితే చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. 

ఈ విషయమై క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతనిధుల ఇదివరకే బీసీసీఐతో చర్చలు జరిపారు. ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టర్లు, ఫ్రాంచైజీలు ఈ ఆలోచనకు మద్దతు ఇస్తున్నాయి.బీసీసీఐతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. మొదట్లో ఇది సాకారం అయ్యే కలలా అనిపించలేదు కానీ, ఇప్పుడు కార్యరూపం దాల్చే దిశగా అడుగులుపడుతున్నాయి.  

చెన్నైలో తొలి మ్యాచ్‌..?  
అన్నీ అనుకున్నట్లు జరిగితే, BBL 2026–27 సీజన్‌ తొలి మ్యాచ్‌ చెన్నైలో జరగవచ్చు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పెర్త్‌ స్కార్చర్స్‌ ఆరంభ మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement