రహానే రిటైర్మెంట్‌పై బీసీసీఐ తొలి స్పందన | BCCI Reacts to Ajinkya Rahane Retirement: Emotional Tribute on X | Sakshi
Sakshi News home page

రహానే రిటైర్మెంట్‌పై బీసీసీఐ తొలి స్పందన

Jul 30 2026 3:14 PM | Updated on Jul 30 2026 3:28 PM

BCCI-Reacted-With-Cryptic-Post-About-Ajinkya Rahane-Retirement

Photo Credit: BCCI Twitter

టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్ అజింక్య ర‌హానే గురువారం త‌న 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ద‌శాబ్దంన్న‌ర‌ పాటు భార‌త క్రికెట్‌లో త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందిన ర‌హానే ఇటీవ‌లే ఫామ్ కోల్పోయి జాతీయ జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. వ‌య‌సు మీద‌ప‌డ‌డం, ఫామ్ లేమి, జ‌ట్టులో యువకుల రాక పెర‌గ‌డం వెర‌సి ర‌హానే క్ర‌మంగా టీమిండియాకు దూర‌మ‌వుతూ వ‌చ్చాడు.  

అయితే ఐపీఎల్‌లో మాత్రం ర‌హానే ఇప్ప‌టికీ యాక్టివ్‌గానే ఉన్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన ర‌హానే వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో మ‌నకు మ‌రోసారి క‌నిపించొచ్చు. ఇదిలా ఉంటే ర‌హానే రిటైర్మెంట్ పోస్టుపై బీసీసీఐ తొలిసారి త‌న‌ స్పంద‌న వ్య‌క్తం చేసింది. భారత క్రికెట్‌కు ర‌హానే అందించిన సేవ‌ల‌కు కృత‌జ్క్ష‌తలు తెలుపుతూ 'ఎక్స్‌' వేదిక‌గా ట్వీట్ చేసింది. 

'ఒక అద్భుత‌మైన కెరీర్ ముగిసింది. క్రికెట‌ర్‌గా భార‌త క్రికెట్‌కు మీరు అందించిన సేవ‌ల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అజింక్య ర‌హానే. క్రికెటర్‌గా మీరు సాధించిన అద్భుత విజయాలు ఒక  జ్ఞాప‌కాలుగా ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయ‌న‌డంలో సందేహం లేదు. రిటైర్మెంట్‌ తర్వాతి చాప్ట‌ర్‌కు ‘ఆల్ ది బెస్ట్ ర‌హానే'’ అంటూ బీసీసీఐ ఎమోషనల్‌ ట్వీట్‌​ చేసింది..

15 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్‌లో ర‌హానే 85 టెస్టుల్లో 5,077 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 సెంచ‌రీలు, 26 అర్ధ‌సెంచ‌రీలున్నాయి. ఇక 90 వ‌న్డే మ్యాచ్‌ల్లో 2,962 ప‌రుగులు సాధించిన ర‌హానే ఖాతాలో మూడు సెంచ‌రీలు, 24 అర్ధ‌శ‌తకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో 20 మ్యాచ్‌లాడిన ర‌హానే 375 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. 

ర‌హానేకు టెస్టు కెప్టెన్‌గా అజేయమైన రికార్డు ఉంది. అత‌డి కెప్టెన్సీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోక‌పోవ‌డం విశేషం. 2020-21 బోర్డ‌ర్ గావ‌స్క‌ర్ ట్రోఫీని ర‌హానే సార‌థ్యంలోనే టీమిండియా 2-1 తేడాతో చారిత్రక సిరీస్ విజ‌యాన్ని అందుకుంది. అంతేకాదు 2017లో ధ‌ర్మ‌శాల‌లో ఆస్ట్రేలియాపై టెస్టు విజ‌యం, 2018లో అఫ్గానిస్తాన్‌పై విజ‌యంలో ర‌హానే కెప్టెన్‌గా, బ్యాట‌ర్‌గా కీల‌క‌పాత్ర పోషించాడు.

 

 

 

Read: జెమీమా విధ్వంసం.. ప‌రుగు తేడాతో థ్రిల్లింగ్‌ విజ‌యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement