న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ బయో బబుల్ వాతావరణంలో జరుగుతుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకుల్ని స్టేడియాలకు అనుమతించకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యాజమానులు, జట్టులో మిగతా స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా క్వారంటైన్ రూల్స్‌కు కట్టుబడి ఉండాలనేది బీసీసీఐ నిబంధన. వీటిని మరింత కఠినతరం చేస్తూ బీసీసీఐ మరో అల్డిమేటం జారీ చేసింది. ఎవరైనా హద్దులు దాటితే వారికి టోర్నీ నుంచి ఉద్వాసన తప్పదనే వార్నింగ్ ఇచ్చింది. (చదవండి: టాప్-20 ఫాస్టెస్ట్ బాల్స్.. ఒక్కడే 16)
ఈ మేరకు అన్ని ఫ్రాంచైజీలకు నోటిఫికేషన్‌ను బీసీసీఐ పంపింది. ఎవరైనా బయో బబుల్ నిబంధనను ఉల్లంఘిస్తే కచ్చితంగా ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అదే సమయంలో ఒక మ్యాచ్ నుంచి సస్పెన్షన్ తప్పదు. ఇక రెండోసారి కూడా అదే తప్పిదం చేస్తే మాత్రం వారిని టోర్నమెంట్‌ను తొలగిస్తామని బీసీసీఐ తన నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇక వారి స్థానంలో రిప్లేస్‌మెంట్ కూడా ఏమీ ఉండదని తెలిపింది. తొలిసారి నిబంధన ఉల్లంఘనకే రూ. 1 కోటి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేవలం ఆటగాళ్లకే కాదు.. జట్టు అధికారులకు ఫ్యామిలీ మెంబర్స్‌కు ఇదే రూల్ వర్తిస్తుందని తెలిపింది. ప్రతీ ఐదు రోజులకొకసారి అంతా కోవిడ్-19 టెస్టులు చేయించుకోవాలని బీసీసీఐ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment