రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టి20లో టీమిండియా సౌతాఫ్రికాపై 82 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది. ఈ క్రమంలోనే టీమిండియా తమ టి20 చరిత్రలో ప్రొటీస్ జట్టుపై అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇటీవలే వైజాగ్ వేదికగా జరిగిన మూడో టి20లో 48 పరుగుల విజయం రెండో అతి పెద్దదిగా ఉండగా.. ఇక 2007లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 37 పరుగులతో విజయం మూడోదిగా ఉంది.
ఇక టి20ల్లో సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. తాజాగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలింది. ఇంతకముందు 2020లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో టి20లో 89 పరుగులు రెండో అత్యల్పంగా ఉంది. సౌతాఫ్రికాకు మూడో అత్యల్ప స్కోరు(96 పరుగులు) మళ్లీ ఆస్ట్రేలియాపైనే ఉంది, 2018లో శ్రీలంకతో టి20లో 98 పరుగులు దక్షిణాఫ్రికాకు నాలుగో అత్యల్ప టి20 స్కోరు.
చదవండి: Dinesh Karthik: 37 ఏళ్ల వయసులో..'డీకే'తో అట్లుంటది మరి
Comments
Please login to add a commentAdd a comment