
సాంటెండర్ (స్పెయిన్): మూడు దశాబ్దాల ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో అండర్–19 పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేందుకు తమిళనాడు టీనేజర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ విజయం దూరంలో నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 18 ఏళ్ల శంకర్ 21–13, 21–15తో పనిత్‌చాపోన్ తీరారత్‌సకుల్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. నేడు జరిగే ఫైనల్లో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)తో శంకర్ తలపడతాడు. ఫైనల్ చేరే క్రమంలో ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన శంకర్ తన ప్రత్యర్థులకు కేవలం ఒక గేమ్ మాత్రమే కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment