నడిరోడ్డుపై చాహల్‌ హల్‌చల్‌! | Cricket Fans Slams Yuzvendra Chahal Over Viral Smoking Video | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై చాహల్‌ హల్‌చల్‌.. సెన్స్‌ లేదా అంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం!

Apr 11 2026 12:10 PM | Updated on Apr 11 2026 12:58 PM

Cricket Fans Slams Yuzvendra Chahal Over Viral Smoking Video

పంజాబ్ కింగ్స్ బౌల‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ చిక్కుల్లో ప‌డ్డాడు. ప‌బ్లిక్ ప్లేస్‌లో అత‌డు ప్ర‌వర్తించిన తీరును త‌ప్పుబ‌ట్టిన క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్య‌మం వేదిక‌గా ట్రోల్స్‌కు దిగారు. నడిరోడ్డుపై ల‌గ్జ‌రీ కారులో ర‌య్యిమ‌ని దూసుకెళ్ల‌డం త‌ప్పుకాక‌పోవ‌చ్చు కానీ కాల్చిన సిగ‌రేట్‌ను క‌నీసం ఆర్పాల‌నే సోయి లేకుండా దానిని రోడ్డు మీద పడేయ‌డ‌మేంట‌ని ఫ్యాన్స్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఈ చ‌ర్య వ‌ల్ల ఎవ‌రికైనా ప్ర‌మాదం జ‌రిగి ఉంటే దానికి చాహ‌ల్ బాధ్య‌త వ‌హించేవాడా అని మండిప‌డ్డారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ‘సివిక్ సెన్స్ లేని క్రికెట‌ర్‌ను ఇప్పుడు మీకు ప‌రిచయం చేస్తున్నాం.. అత‌డే య‌జ్వేంద్ర చాహ‌ల్‌. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో కాల్చిన సిగ‌రేట్‌ను ఆర్పి పడేయాల‌న్న సోయి అత‌డికి లేదు.’అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. 

‘డ‌బ్బులు సంపాదించ‌డం కాదు ముందు బహిరంగ ప్ర‌దేశాల్లో ఎలా ప్ర‌వ‌ర్తించాల‌నే బేసిక్ సెన్స్ నేర్చుకో’ అంటూ మ‌రొక వ్య‌క్తి కామెంట్ చేశాడు. అయితే ఇటీవ‌లే డివిలియ‌ర్స్‌తో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో తాను మందు మానేసి ఆరు నెల‌ల‌కు పైనే అయిన‌ట్లు పేర్కొన్నాడు. ఫిట్‌నెస్‌, ఎక్కువ‌కాలం ఆరోగ్యంగా ఉండ‌డం కోస‌మే ఈ చ‌ర్య‌కు పూనుకున్న‌ట్లు తెలిపాడు. 

ఇక ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ త‌ర‌ఫున ఆడుతున్న చాహ‌ల్ మూడు మ్యాచ్‌లు క‌లిపి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు.  ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో దూకుడు మీద ఉంది. కేకేఆర్‌తో జ‌రిగిన మూడో మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం కావ‌డంతో 5 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉంది. 

ఇవాళ డ‌బుల్ హెడర్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డ‌నుంది.

చదవండి: సాకర్‌ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement