Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్‌కింగ్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గెలుపు రుచి చూసింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 23 పరుగుల తేడాతో గెలుపొందింది. సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
మూడు వరుస ఓటముల తర్వాత సెంచరీతో జట్టును గెలిపించడం సంతోషంగా ఉందన్నాడు. వరుసగా విఫలమైనప్పటికీ జట్టు మేనేజ్‌మెంట్ తనపై నమ్మకం ఉంచడం గొప్ప విషయమన్నాడు. తన సెంచరీని సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్‌కు అంకితమిస్తున్నట్లు శాంసన్ తెలిపాడు.
శాంసన్ మాట్లాడుతూ.. ‘ఈసెంచరీ నాకు ఎంతో ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే నాపై నమ్మకంతో చెన్నై ఫ్రాంచైజీ ట్రేడింగ్‌లో నన్ను దక్కించుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పుడు వారి నమ్మకాన్ని కోల్పోతున్నానేమోననిపించింది. కానీ ఇవాళ బాధ్యతా యుతంగా ఆడి సెంచరీ చేయడంతో పాటు వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాను.
ఇంతకాలం ఒక ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు మరో కొత్త ఫ్రాంచైజీకి ఆడడం కొంత కష్టమే. కానీ నాకు చెన్నై విషయంలో అది ఏనాడు కనిపించలేదు. చెన్నైకి ఆడుతుంటే నేను మరో సొంత ఇంటికి వచ్చానన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. అందరూ ప్రశాంతంగా కనిపిస్తున్నారు.
అయితే వరుసగా మూడు ఓటములు చవిచూసినప్పటికీ ఇవాళ మ్యాచ్‌కు ముందు మేమంతా కేవలం 50 సెకన్లు మాత్రమేమీటింగ్ పెట్టుకున్నాం. ఆ యాబై సెకన్లు నేను ఒక టీమ్‌తో ఎంత కనెక్ట్ అయ్యాననేది చూపించింది. నేను గతంలో చాలాసార్లు విఫలమయ్యాను. అలాంటప్పుడు మనసు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది.
కానీ నా బేసిక్స్ ఏంటో తెలుసుకొని వాటిని పాటించడమే ముఖ్యం. అందుకోసం మా సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాను. మ్యాచ్‌లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా అవసరం. ఆయుష్ చాలా పరిణతితో ఆడాడు. మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కోసమే నా సెంచరీని సెలెబ్రేట్ చేసుకున్నాను. పరిస్థితులు ఎంత సవాలుగా ఉంటాయో నాకు తెలుసు. అందుకే ఈ ఇన్నింగ్స్‌ను ఆయనకు అంకితం చేయాలనుకున్నాను.’ అని తెలిపాడు.
🗣️🗣️ 𝙄𝙩 𝙛𝙚𝙚𝙡𝙨 𝙡𝙞𝙠𝙚 𝙘𝙤𝙢𝙞𝙣𝙜 𝙩𝙤 𝙖𝙣𝙤𝙩𝙝𝙚𝙧 𝙝𝙤𝙢𝙚 🏠
Sanju Samson reflects on his match-winning knock and the love from the Chennai crowd 💛
Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC | @IamSanjuSamson | @ChennaiIPL pic.twitter.com/H4X2sug3sB— IndianPremierLeague (@IPL) April 11, 2026
#CSK fans, bring out the whistles 💛
A first win of the season for the 5⃣-time #TATAIPL champions 👏
Scorecard ▶️ https://t.co/BzGc6O65jX #KhelBindaas | #CSKvDC | @ChennaiIPL pic.twitter.com/tS2xyOWgdj— IndianPremierLeague (@IPL) April 11, 2026


