![CSK in Trouble as case filed against MS Dhonis side after IPL Tickets sale - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/18/chennai.jpg.webp?itok=6VA52iTJ)
ఐపీఎల్-2023లో భాగంగా మే20న అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేను ఓ వివాదం చుట్టుముట్టుంది. సీఎస్‌కే మెనెజ్‌మెంట్ ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది.
ఈ క్రమంలో చెన్నైకు చెందిన ఓ న్యాయవాది కేసు దాఖలు చేశారు. సీఎస్‌కేతో పాటు బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌పై ఆయన చెన్నై సివిల్ కోర్టులో మే17న ఫిటిషిన్ వేశారు. కాగా ఇప్పటివరకు సీఎస్‌కే తమ హోం గ్రౌండ్ చెపాక్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఈ ఏడు మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బ్లాక్‌లో విక్రయించందని వార్తలు వినిపిస్తున్నాయి.
రూ.1500, 2000 ధరలుగా వుండే లోయర్ స్టాండ్ టిక్కెట్లను 8,000 రూపాయలకు విక్రయించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అందులో సీఎస్‌కే మెనెజ్‌మెంట్ పాత్ర కూడా ఉంది అని పలువరు అరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అశోక్ చక్రవర్తి అనే అడ్వకేట్ కేసు ఫైల్ చేశారు.
"ఏంఎ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల అమ్మకాలలో అక్రమాలు, బ్లాక్ మార్కెట్, ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరగతున్నాయి. ఇందుకు సంబంధించి నేను ఈ రోజు సివిల్ కోర్టులో కేసు వేశాను. చెన్నై సూపర్ కింగ్స్, బీసీసీఐ, టీఎన్‌సీఏలపై ఫిటిషిన్ దాఖలు చేశాను" అని అశోక్ చక్రవర్తి తన ఫేస్‌బుక్ పోస్టు చేశారు.
కాగా చెన్నై వేదికగానే ఈ ఏడాది ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అంతకుతోడు సీఎస్‌కే సారధి ఎంఎస్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అని ప్రచారం జరగతుండడంతో.. అభిమానులు ఎంత ధర చెల్లించడానికైనా సిద్దమవుతున్నారు.
చదవండి: గావస్కర్.. సెహ్వాగ్ దగ్గరకు రాడు! వీరూనే వెళ్లాలి.. అర్థమైందా? టీమిండియా యువ ఓపెనర్లకు చురకలు!
Comments
Please login to add a commentAdd a comment