
టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఓపెనర్‌గా వార్నర్ నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన వార్నర్.. ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు 105 టెస్టులు ఆడిన వార్నర్ ఓపెనర్‌గా 8,208 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను వార్నర్ అధిగమించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో సెహ్వాగ్(8,207) ఐదో స్ధానంలో ఉండగా.. తాజా మ్యాచ్‌తో ఆ స్ధానాన్ని డేవిడ్ భాయ్ కైవసం చేసుకున్నాడు.
ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్(11, 845) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాతి స్ధానాల్లో వరుసగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(9,607), గ్రేమ్ స్మిత్(9,030), మథ్యూ హేడన్(8,625) పరుగులతో ఉన్నారు.
గెలుపెవరిది?
ఇక యాషెస్ తొలి టెస్టు తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆట ఆఖరిరోజు విజయానికి ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్ మరో 174 పరుగులు చేయాల్సి ఉంది.281 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 34, నైట్ వాచ్‌మన్ స్కాట్ బొలాండ్ 13 పరుగులతో ఆడుతున్నారు.
చదవండి: #Ashes2023: ఇదేమి యార్కర్‌రా బాబు.. దెబ్బకు బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్