David Warner Hilarious Response To Fan Asking For Jersey Video Viral - Sakshi
Sakshi News home page

David Warner: నీ షర్ట్‌ ఇస్తావా? చిన్నారి ఫ్యాన్స్‌కు వార్నర్‌ సరదా రిప్లై.. వీడియో వైరల్‌

Published Fri, Nov 18 2022 2:17 PM | Last Updated on Fri, Nov 18 2022 3:02 PM

David Warner Hilarious Response To Fan Asking For Jersey Video Viral - Sakshi

డేవిడ్‌ వార్నర్‌ (PC: ICC)

England tour of Australia, 2022- Australia vs England, 1st ODI: ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ మధ్య మొదటి వన్డే సందర్భంగా ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. అభిమానులను తనదైన శైలిలో అలరించే ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. తన చిన్నారి ఫ్యాన్‌కు బదులిచ్చిన తీరు సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో ఆసీస్‌- ఇంగ్లండ్‌ గురువారం తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది ఆతిథ్య జట్టు. ఆసీస్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ డేవిడ్‌ మలన్‌ 134 పరుగులతో రాణించడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ 86, ట్రవిస్‌ హెడ్‌ 69 పరగులతో శుభారంభం అందించగా.. స్టీవ్‌ స్మిత్‌ 80 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదిలా ఉంటే.. విల్లే బౌలింగ్‌లో బిల్లింగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన వార్నర్‌ సహచర ఆటగాళ్లతో కలిసి డగౌట్‌లో కూర్చున్నాడు. ఈ సందర్భంగా ఓ బాలుడు.. ‘‘డేవిడ్‌ వార్నర్‌.. నీ షర్ట్‌ నాకిస్తావా’’ అని రాసి ఉన్న ప్లకార్డు ప్రదర్శించాడు. బిగ్‌ స్క్రీన్‌పై దీనిని చూసిన వార్నర్‌ సరదాగా బదులిచ్చాడు.

‘‘ఇక్కడి వచ్చెయ్‌.. మార్నస్‌ షర్ట్‌ తీసుకో’’ అంటూ డగౌట్‌ దగ్గరకు రమ్మన్నాడు. ఇంతలో మరో పిల్లాడు.. ‘‘మార్నస్‌ నీ షర్ట్‌ నాకిస్తావా’’అంటూ మరో ప్లకార్డు ప్రదర్శించాడు. దీంతో వార్నర్‌ నవ్వుతూ రండి రండి అంటూ సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా ఈ మ్యాచ్‌ మార్నస్‌ లబుషేన్‌ కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

చదవండి: IND Vs NZ 1st T20: ఆగని వర్షం.. భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టీ20 రద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement