Innovative Steve Smith Tries Play Switch-Hit On Free-Hit But Fails Viral - Sakshi
Sakshi News home page

Steve Smith: మనకు రానిది ప్రయత్నిస్తే ఫలితం ఇలాగే ఉంటది!

Published Sat, Nov 19 2022 1:50 PM | Last Updated on Sat, Nov 19 2022 3:47 PM

Innovative Steve Smith Tries Play Switch-Hit On Free-Hit But Fails Viral - Sakshi

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య మొదలైన రెండో వన్డే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఫ్రీ హిట్‌ను స్విచ్‌హిట్‌గా మలుద్దామనుకొని బొక్కబోర్లా పడ్డాడు ఆస్ట్రేలియా బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌. అలా ఒక ఫ్రీ హిట్‌ను అనవసరంగా వృదా చేసుకున్నాడు. విషయంలోకి వెళితే.. స్మిత్‌ 57 పరుగుల వద్ద ఉండగా.. 32వ ఓవర్‌ వేసిన ఆదిల్‌ రషీద్‌ ఒక బంతిని నోబాల్‌ వేశాడు. దీంతో ఆసీస్‌కు ఫ్రీహిట్‌ లభించింది.

అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న స్మిత్‌ ఎలాగైనా భారీ షాట్‌ ఆడాలని చూశాడు. నార్మల్‌గా ఆడినా సరిపోయేది.. అనవసరంగా గొప్పలకు పోయిన స్మిత్‌ స్విచ్‌ హిట్‌ ఆడాలని చూశాడు. రషీద్‌ బంతి విడుదల చేయగానే లైఫ్ట్‌ హ్యాండ్‌వైపు తిరిగి స్విచ్‌ హిట్‌ చేసే ప్రయత్నంలో మిస్సయ్యాడు. ఆ తర్వాత కోపంతో తనను తానే తిట్టుకోవడం కనిపించింది. అందుకే మనకు రానిది ప్రయత్నిస్తే ఇలాంటి ఫలితమే ఎదురవుతుంది స్మిత్‌ అంటూ అభిమానులు కామెంట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ మ్యాచ్‌లో స్మిత్‌ తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 80 పరుగులు చేసిన స్మిత్‌.. ఈ మ్యాచ్‌లో 114 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. అయితే నాలుగు పరుగుల తేడాతో స్మిత్‌ సెంచరీకి దూరమయ్యాడు. ఇక ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. స్మిత్‌ 94, లబుషేన్‌ 58 పరుగులు చేయగా.. చివర్లో మిచెల్‌ మార్ష్‌ 50 పరుగులు చేయడంతో ఆసీస్‌ మంచి స్కోరు సాధించింది.

చదవండి: రోహిత్‌ మెడపై కత్తి పెట్టి, హార్ధిక్‌కు పట్టం కట్టి.. ఇవన్నీ జై షా వ్యూహాలేనా..?

సెలెక్టర్ల కథ ముగించారు.. రోహిత్‌ శర్మను ఎప్పుడు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement