PC: IPL.com
ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఓటముల పరంపర కొనసాగిస్తోంది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. వరుస పరాజయాలతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో లలిత్ యాదవ్‌పై ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కోపంతో ఊగిపోయాడు.
ఏం జరిగిందంటే?
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన గ్రీన్ బౌలింగ్‌లో వార్నర్ మిడ్‌ఆఫ్ దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అది మిస్‌టైమ్ కావడంతో మిడ్‌ఆఫ్‌లో ఉన్న చావ్లా చేతికి వెళ్లింది. చావ్లా ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ క్రమంలో వార్నర్ సింగిల్ కోసంప్రయత్నించగా.. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న లలిత్ యాదవ్ వార్నర్‌ను గమనించకుండా చావ్లా వైపు చూస్తూ ఉండిపోయాడు.
దీంతో వార్నర్ అతడిపై గట్టిగా అరుస్తూ రన్‌కు వెళ్లుంటూ సైగలు చేశాడు. అప్పుడు లలిత్ వికెట్ కీపర్‌వైపు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఒక వేళ చావ్లా బంతిని వెంటనే వికెట్ కీపర్‌కు త్రో చేసి ఉంటే వార్నర్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరేవాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో వార్నర్ 51 పరుగులు సాధించాడు. ఢిల్లీ తమ తదుపురి ఏప్రిల్ 15న ఆర్సీబీతో తలపడనుంది.
చదవండి: IPL 2023: మా విజయానికి కారణం అదే.. అతడొక యువ సంచలనం! వారికి మరిన్ని..
— IPLT20 Fan (@FanIplt20) April 11, 2023
Comments
Please login to add a commentAdd a comment