ఫిన్ అలెన్‌ది ఔటా? నాటౌటా? | Digvesh Rathi takes controversial catch to dismiss Finn Allen | Sakshi
Sakshi News home page

IPL 2026: ఫిన్ అలెన్‌ది ఔటా? నాటౌటా?

Apr 9 2026 9:28 PM | Updated on Apr 10 2026 9:39 AM

Digvesh Rathi takes controversial catch to dismiss Finn Allen

ఐపీఎల్ 2026లో అంపైరింగ్ నిర్ణయాలు తీవ్ర వివాదస్పదమవుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ అవుటైన‌ తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. లక్నో ఫీల్డర్ దిగ్వేష్ రాఠీ పట్టిన క్యాచ్ క్లీన్ క్యాచ్ కాదా? అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

ఏమి జరిగిందంటే?
కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌లో ల‌క్నో పేస‌ర్ ప్రిన్స్ యాద‌వ్ వేసిన నాలుగో బంతిని ఫిన్ అలెన్ లెగ్ సైడ్‌ భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని  డీప్ థర్డ్ మ్యాన్ వైపు వెళ్ళింది. అక్కడ ఉన్న దిగ్వేష్ రాఠీ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టే సమయంలో రాఠీ కాలు బౌండరీ లైన్‌కు తాకిన‌ట్లు క‌న్పించింది.

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేయాలి. కానీ ఆశ్చర్యకరంగా ఫీల్డ్ అంపైర్లు అలెన్‌ను నేరుగా అవుట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత రిప్లేలో అతడి కాలి బౌండరీ రోప్‌కు తాకినట్లు అన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఇది చూసిన నెటిజన్లు అది క్లియర్‌గా నాటౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతకుముందు ఇదే సీజన్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్‌, అభిషేక్ శర్మ క్యాచ్‌లు కూడా వివాదస్పదమయ్యాయి.


 

 

Advertisement
 
Advertisement
Advertisement