కొలంబొ: శ్రీలంక పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. తొలి టీ20లో దక్షిణాఫ్రికా 28 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మక్రమ్ 48 పరుగులతో ఆకట్టుకోవడం.. ఓపెనర్లు డికాక్ 36 పరుగులు, హెండ్రిక్స్ 38 పరుగులుతో రాణించడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లంక బౌలర్లలో హసరంగ రెండు వికెట్లు తీయగా.. చమీరా, తీక్షణ, దాసున్ షనక తలా ఒక వికెట్ తీశారు.
చదవండి: Pak Vs NZ: ఆ సిరీస్‌లో నో డీఆర్‌ఎస్..
అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ దినేష్ చండిమల్ (66 పరుగులు నాటౌట్) చివరి వరకు నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు వికెట్లు తీయకపోయినప్పటికీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక పరుగులు చేయలేకపోయింది. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకముందు జరిగిన వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది.
చదవండి: India Tour Of South Africa: ఈసారైనా నెగ్గుకొచ్చేనా..?
Comments
Please login to add a commentAdd a comment