ఫిఫా టీమ్ నుంచి తొలగింపు.. రిఫరీ అనుమానాస్పద మృతి! | Dutch Referee-Sudden-Demise-After Removing From FIFA WC 2026 Team | Sakshi
Sakshi News home page

ఫిఫా టీమ్ నుంచి తొలగింపు.. రిఫరీ అనుమానాస్పద మృతి!

Jul 14 2026 9:14 AM | Updated on Jul 14 2026 11:29 AM

Dutch Referee-Sudden-Demise-After Removing From FIFA WC 2026 Team

ప్రపంచం మొత్తం ఫిఫా ప్రపంచకప్ మాయలో పడిపోయిన వేళ ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. నెదర్లాండ్స్ రిఫరీ రాబ్ డిపెరింక్ (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిజానికి 2026 ఫిఫా ప్రపంచకప్ టీమ్‌లో రాబ్ డిపెరింక్ సభ్యుడిగా ఉండాల్సింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్‌) టీమ్‌లో రాబ్ విధులు నిర్వర్తించాల్సింది. 

కానీ అతడిపై లైంగిక ఆరోపణలు రావడంతో ఫిఫా టీమ్ నుంచి తప్పించారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును క్లోజ్ చేసినప్పటికీ, తాజాగా డచ్ రిఫరీ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. తనపై అకారణంగా ఆరోపణలు చేశారనే కారణంతో ఆత్యహత్మకు పాల్పడ్డాడా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనేది పోలీసులు విచారిస్తున్నారు. 

ఇక రాబ్ డిపెరింక్ మృతి విషయాన్ని డచ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధికారికంగా ధ్రువీకరించింది. 2017 నుంచి రాబ్‌ డిపెరింక్ నెదర్లాండ్స్ రిఫరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2024 యూరో చాంపియన్‌షిప్‌లో రాబ్ వీఏఆర్ బృందంలో పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే 2026 ఫిఫా ప్రపంచకప్ రోస్టర్‌లో వీఏఆర్ టీమ్‌లో రిఫరీగా పేరును చేర్చడం జరిగింది. 

ఈలోగా అతడిపై లైంగిక ఆరోపణలు రావడంతో లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు రాబ్ డిపెరింక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాబ్‌ను ఫిఫా టీమ్ నుంచి తొలగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని, అకారణంగా తనను అరెస్టు చేశారని, ఫలితంగా ఫిఫా 2026లో వీఏఆర్ టీమ్‌లో రిఫరీగా విధులు నిర్వర్తించే సువర్ణావకాశాన్ని కోల్పోయినట్లు తన గోడును వెల్లబోసుకున్నాడు.

చదవండి: ఫ్రాన్స్‌, స్పెయిన్‌ మధ్య తొలి సెమీస్‌.. ఫైనల్‌ చేరేదెవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement