అహ్మదాబాద్: టీమిండియాతో ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20ని చేజార్చుకున్న బాధలో ఉన్న ఇంగ్లీష్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ జట్టుకు జరిమానా పడింది. నిర్ణీత సమయంలోపు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరి జవగళ్ శ్రీనాథ్ ఇంగ్లండ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించాడు. ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తమ తప్పిదాన్ని అంగీకరించడంతో పాటు జరిమానాకు కూడా భరిస్తామని రిఫరికి హామీ ఇచ్చాడు.
కాగా, ఇదే సిరీస్‌లో జరిగిన రెండో టీ20లో టీమిండియాకు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కోత పడిన సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో చేసుకుంది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్ ఇదే వేదికగా ఆదివారం జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment