ఆసియాకప్ 2022లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌లు ఆగస్టు 28న తలపడనున్నాయి. అయితే ఈ హై వోల్డేజ్ మ్యాచ్‌కు ఇరు జట్ల నుంచి స్టార్ పేసర్లు దూరమయ్యారు. ఒకరు టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా.. మరొకరు పాకిస్తాన్ స్టార్ షాహిన్ అఫ్రిది. ఈ ఇద్దరు తమ జట్లకు ప్రధాన బౌలర్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకరు పదునైన యార్కర్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తే.. మరొకరు ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగర్లతో వికెట్లు పడగొట్టడంలో ఘనాపాటి. ఇద్దరు ఎవరికి వారే సాటి. కానీ గాయాలతో ఏకకాలంలో ఆసియా కప్‌కు దూరమయ్యారు. వీరి లోటును ఎవరు భర్తీ చేస్తారంటూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇక షాహిన్ అఫ్రిది మోకాలి గాయంతో బాధపడతున్నాడు.ఈ ఏడాది జాలైలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా అఫ్రిది గాయపడ్డాడు. శ్రీలంకతో అఖరి టెస్టుతో పాటు నెదార్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. కాగా ప్రస్తుతం అతడు తన గాయం తీవ్రత దృష్ట్యా నాలుగు నుంచి ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాలని పీసీబీ మెడికల్ అడ్వైజరీ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అఫ్రిది ఆసియాకప్‌కు దూరమయ్యాడు.
మరోవైపు బుమ్రా పరిస్థితి అంతే. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బుమ్రా.. వెన్ను నొప్పి కారణంగా అఖరి వన్డేకు దూరమయ్యాడు. ఇక ఇంగ్లండ్ పర్యటన అనంతరం విండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కు బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. కాగా బుమ్రా ఇంకా వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆసియా కప్‌కు పక్కనబెట్టింది.
అయితే ఇదంతా అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్ 2022 గురించే. భారత్, పాకిస్తాన్‌లు టి20 ప్రపంచకప్‌లో ఒకే గ్రూఫ్‌లో ఉన్నాయి. అక్టోబర్ 23న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్‌తో పోలిస్తే.. టి20 ప్రపంచకప్‌కు క్రేజ్ ఎక్కువ. ఇప్పుడు ఈ ఇద్దరిని ఆడిస్తే.. గాయాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉండడంతోనే ఇరుజట్లు తమ స్టార్ పేసర్లకు విశ్రాంతినిచ్చాయని చెప్పొచ్చు.
ఇక ఆసియాకప్‌లో భాగంగా ఆగస్టు 28న భారత్, పాక్‌లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఆసియాకప్‌లో ఇరుజట్లు 14సార్లు తలపడగా.. భారత్ 8 సార్లు.. పాకిస్తాన్ ఐదు సార్లు గెలిచాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు.
చదవండి: భారత్-పాక్ మ్యాచ్‌లో విజేత ఎవరు? అఫ్రిది నుంచి ఊహించని ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment