
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే తెలుగుతేజం నంబూరి తిలక్ వర్మ అదరగొట్టాడు. 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ ఆఖరివరకు అజేయంగా నిలిచి ముంబైకి గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
టాప్ స్టార్స్ అంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగినా తాను మాత్రం ఒక ఎండ్‌లో మూలస్థంభంలా నిలబడి ముంబైని ఆదుకున్నాడు. 46 బంతుల్లో 84 పరుగులు నాటౌట్‌గా నిలిచిన తిలక్ వర్మకు ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్‌లో ఒక బెస్ట్ ఇన్నింగ్స్‌గా ఉండిపోతుందనడంలో సందేహం లేదు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తరపున తిలక్ వర్మ ఒక అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో ముంబై తరపున ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకముందు హార్దిక్ పాండ్యా 2019లో కేకేఆర్‌పై 91 పరుగులు, కీరన్ పొలార్డ్ 2021లో సీఎస్‌కేపై 87 పరుగులు నాటౌట్ ఉన్నారు. తాజాగా వీరి సరసన తిలక్ వర్మ చోటు సంపాదించాడు. ఇక తిలక్ వర్మ బ్యాటింగ్ అతని కుటుంబసభ్యులు స్టాండ్స్ నుంచి చూస్తూ ఎంజాయ్ చేయడం ఆసక్తి కలిగించింది.
గత సీజన్‌తోనే తానేంటో నిరూపించుకున్న తిలక్ వర్మపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. తిలక్‌వర్మ ముంబై ఇండియన్స్ జట్టులో ఉండడం వారి అదృష్టం. తెలుగుతేజం అయిన ఈ ఆటగాడు ఎస్‌ఆర్‌హెచ్‌లో ఎందుకు లేడని తెగ ఫీలవుతున్నారు.
చదవండి: భర్త ఘనతను దగ్గరుండి ఎంజాయ్ చేసిన ధనశ్రీ
Video of the day - celebrations from the family of Tilak Varma. pic.twitter.com/ZWvhZHVyrk
— Johns. (@CricCrazyJohns) April 2, 2023