సెమీస్‌ సమరం.. ఎవరి బలమెంత? | FIFA World Cup 2026 Semi Finals Confirmed, Check Out Full Matches Schedule, Head To Head Records, Venues, Prediction And Other Details | Sakshi
Sakshi News home page

FIFA 2026: సెమీస్‌ సమరం.. ఎవరి బలమెంత?

Jul 13 2026 9:20 AM | Updated on Jul 13 2026 1:22 PM

FIFA World Cup 2026-Semi Final Matches-Schedule-Venues-Prediction

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్ బెర్తులు ఖరార‌య్యాయి. ఈసారి గ్రూప్ ద‌శ‌లో 48 జ‌ట్లు పాల్గొన్నాయి. రౌండ్ ఆఫ్ 32, ప్రిక్వార్ట‌ర్స్‌, క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లో వ‌డ‌పోత త‌ర్వాత నాలుగు జ‌ట్లు మిగిలాయి. డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాలో అర్జెంటీనా ద‌ర్జాగా సెమీస్‌లో అడుగుపెట్ట‌గా, 2022 ఫిఫా ర‌న్న‌ర‌ప్ ఫ్రాన్స్ కూడా వ‌రుస‌గా మూడోసారి (2018, 2022, 2026) సెమీస్‌కు దూసుకొచ్చింది. 

ఇక 16 ఏళ్ల త‌ర్వాత స్పెయిన్ (2010 విజేత‌) సెమీస్‌లో అడుగుపెడితే, అటు మాజీ చాంపియ‌న్ ఇంగ్లండ్ కూడా త‌న దూకుడైన ఆట‌తీరుతో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇప్ప‌టిదాకా త‌మకు ఎదురైన ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టిక‌రిపిస్తూ వ‌చ్చిన ఈ నాలుగు జ‌ట్లు నువ్వా నేనా అన్న రీతిలో సెమీస్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. 

గ‌త ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ లాగే ఈసారి ఫైన‌ల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ పోరును చూస్తామా లేక స్పెయిన్‌, ఇంగ్లండ్ ఆట చూస్తామా అనేది మ‌రో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఈ నేప‌థ్యంలో సెమీస్‌లో ఎవ‌రితో ఎవ‌రు త‌ల‌ప‌డ‌నున్నార‌నేది ఒక‌సారి ప‌రిశీలిద్దాం.


 ఒస్మోన్ డెంబ్లీ, ఫ్రాన్స్‌ (Phot Credit: FIFA Twitter)

జ‌ట్ల బ‌లాబ‌లాలు
👉ఫ్రాన్స్ తరఫున ఎంబాపె అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి ఫిఫాలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌, మూడు అసిస్ట్‌ల‌తో గోల్డెన్ బూట్ రేసులో నంబ‌ర్‌వ‌న్ స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఎంబాపె త‌ర్వాత ఒస్మోన్ డెంబ్లీ కూడా ఫ్రాన్స్‌కు బ‌ల‌మైన ఆట‌గాడు. ఫార్వార్డ్ ప్లేయ‌ర్ అయిన డెంబ్లీ ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్‌, రెండు అసిస్ట్‌ల‌తో గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు.

👉ఇక స్పెయిన్ త‌రఫున కెప్టెన్ రొడ్రితో పాటు యామినే ల‌మాల్ కీల‌క ఆట‌గాళ్లుగా ఉన్నారు. వీరిద్ద‌రితో పాటు మైకెల్ ఒయ‌ర్‌జ‌బాల్ (ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్‌), గోల్ కీప‌ర్ ఉనైయి సిమోన్‌లు కూడా తమదైన ఆట‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు.


మైకెల్ ఒయ‌ర్‌జ‌బాల్, స్పెయిన్ (Phot Credit: FIFA Twitter)

👉ఇంగ్లండ్ జ‌ట్టు కెప్టెన్ హ్యారీకేన్ ఈసారి ఎలాగైనా ఫిఫా ప్ర‌పంచ‌కప్ సాధించాలనే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ త‌ర‌ఫున ఈసారి ఫిఫాలో ఆరు మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ చేసి ఆ జ‌ట్టు త‌ర‌ఫున గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు. హ్యారికేన్‌కు తోడుగా జూడ్ బెల్లింగ్‌హ‌మ్ కూడా కీల‌క ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. బెల్లింగ్‌హమ్ కూడా ఆరు గోల్స్ చేసి హ్యారికేన్‌తో స‌మానంగా ఉన్నాడు.

👉డిఫెండింగ్ చాంపియ‌న్ అర్జెంటీనాకు క‌ర్త, క‌ర్మ‌, క్రియ.. లియోన‌ల్ మెస్సీ. మెస్సీ ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. మెస్సీతో పాటు ఎమిలో మార్టినేజ్‌, జులియ‌న్ అల్వ‌రెజ్‌, అలెక్సిస్ మాక్ అలిస్ట‌ర్‌లు జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు.


జూడ్ బెల్లింగ్‌హ‌మ్, ఇంగ్లండ్ (Phot Credit: FIFA Twitter)

తొలి సెమీస్‌: ఫ్రాన్స్ వ‌ర్సెస్ స్పెయిన్‌
ఫ్రాన్స్, స్పెయిన్ జట్ల మధ్య తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ భార‌త కాల‌మాన ప్ర‌కారం జులై 15న‌ (బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు) జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 38 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా.. స్పెయిన్‌దే పైచేయి. 38 మ్యాచ్‌ల్లో స్పెయిన్ 18 గెలవగా.. ఫ్రాన్స్ 13 గెలిచింది. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే ఫిఫా ప్రపంచక‌ప్‌లో ఈ రెండు జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2016 ప్రపంచక‌ప్‌లో ప్రిక్వార్ట‌ర్స్‌లో ఫ్రాన్స్ 3-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది.


అలెక్సిస్ మాక్ అలిస్ట‌ర్‌, అర్జెంటీనా (Phot Credit: FIFA Twitter)

రెండో సెమీస్‌: అర్జెంటీనా వ‌ర్సెస్ ఇంగ్లండ్‌
ఫిఫాలో రెండో సెమీ-ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ జులై 16 (భార‌త కాల‌మాన ప్ర‌కారం గురువారం అర్ధ‌రాత్రి 12.30 గంట‌లు) అట్లాంటా వేదిక‌గా జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌ల‌ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జ‌ట్లు ఐదు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడగా.. వీటిలో ఇంగ్లండ్‌ మూడు, అర్జెంటీనా రెండు గెలిచాయి. 40 ఏళ్ల క్రితం (1986 ఫిఫా) ఇరుజ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన సెమీస్‌లో అర్జెంటీనా పైచేయి సాధించింది.

సెమీఫైన‌ల్ షెడ్యూల్‌:
👉తొలి సెమీస్: ఫ్రాన్స్ వ‌ర్సెస్ స్పెయిన్‌, బుధ‌వారం అర్ధ‌రాత్రి 12.30 గంట‌ల‌కు, వేదిక‌: అర్లింగ్‌ట‌న్‌, టెక్స‌స్‌

👉రెండో సెమీస్‌: అర్జెంటీనా వ‌ర్సెస్ ఇంగ్లండ్‌, గురువారం అర్ధ‌రాత్రి 12.30 గంట‌ల‌కు, వేదిక‌: అట్లాంటా

చదవండి: శతకంతో ప్ర‌పంచ రికార్డు.. తొలి మహిళా క్రికెట‌ర్‌గా య‌స్తిక భాటియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement