ఫిన్ అలెన్ వరల్డ్‌ రికార్డ్.. ప్రపంచకప్‌ చరిత్రలోనే తొలి బ్యాట్స్‌మెన్‌..! | Finn Allen Smashes Fastest 33 Ball Century T20 World Cup History, Sends New Zealand To Final, Check Details Inside | Sakshi
Sakshi News home page

Finn Allen: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. ప్రపంచకప్‌ చరిత్రలోనే రికార్డ్

Mar 4 2026 10:37 PM | Updated on Mar 5 2026 1:32 PM

Finn Allen blasts fastest century in T20 World Cup history

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ సెమీస్‌లో విధ్వంసం సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్ మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఫిన్ అలెన్ దూకుడుతో సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే చేధించారు. టీ20 వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఫిన్ ‍అలెన్ ఘనత సాధించారు. ఈ విజయంతో న్యూజిలాండ్ టీమ్ వరల్డ్ కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.

కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ భీభత్సం సృష్టించాడు. ఏకంగా పది ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత కోశాడు. ఫిన్ అలెన్ దూకుడుతో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement