IPL 2023, GT Vs MI: Hardik Pandya Poor Form Continues In Batting - Sakshi
Sakshi News home page

GT VS MI: కొనసాగుతున్న హార్ధిక్‌ చెత్త ఫామ్‌.. కెప్టెన్‌ అయితేనేం, తొలగించండి..!

Published Wed, Apr 26 2023 7:37 AM | Last Updated on Wed, Apr 26 2023 5:14 PM

GT VS MI: Hardik Pandya Poor Form With Bat Continues - Sakshi

photo credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 25) జరిగిన మ్యాచ్‌లో అతను బ్యాట్‌తో మరోసారి విఫలం కావడంతో  గుజరాత్‌ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జట్టుకు భారంగా మారాడని దుమ్మెత్తిపోస్తున్నారు. అతను చివరిసారిగా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ ఎప్పుడు ఆడాడో కనీసం అతనికైనా గుర్తుందా అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్‌ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు, రెండు, మూడు మ్యాచ్‌లు పక్కన కూర్చోబెడితే కానీ లైన్‌లోకి వచ్చేలా లేడని కామెంట్స్‌ చేస్తున్నారు. 
(చదవండి: IPL 2023: రోహిత్‌ శర్మ.. కొద్ది రోజులు రెస్ట్‌ తీసుకో..!)

కెప్టెన్‌ కాబట్టి ఎవరు ప్రశ్నించరు అన్న ధీమాతో ఉన్నాడు, గుజరాత్‌ యాజమాన్యం అతని విషయం సీరియస్‌గా తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. సహచరులతో అతను ప్రవర్తించే విధానం కూడా అస్సలు బాగోలేదని, బూతులు తిడుతూ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం సరికాదని, కేవలం పెత్తనం చలాయించాలన్నదే అతని మోటోగా కనిపిస్తుందని అంటున్నారు. బౌలింగ్‌లోనూ అతని ప్రదర్శన ఏమీ బాగోలేదని, జట్టులో మిగతా సభ్యులంతా తలా ఓ చేయి వేస్తుంటే నెట్టుకొస్తున్నాడని చర్చించుకుంటున్నారు. 

ఇది కూడా తన కెప్టెన్సీ వల్లే అనేలా కలరింగ్‌ ఇచ్చుకుంటున్నాడని బహిరంగ కామెంట్స్‌ చేస్తున్నారు. బౌలింగ్‌లో షమీ, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ, నూర్‌ అహ్మద్‌.. బ్యాటింగ్‌లో సాహా, గిల్‌, విజయ్‌ శంకర్‌, మిల్లర్‌, అభినవ్‌ మనోహర్‌ రాణిస్తుండటంతో గుజరాత్‌ వరుస విజయాలు సాధించిందని, ఇందులో హార్ధిక్‌ పాత్ర, అతని కాంట్రిబ్యూషన్‌ ఏమాత్రం లేదని సోషల్‌మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కాగా, ప్రస్తుత సీజన్‌లో గుజరాత్‌ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో  రెండో స్థానంలో కొనసాగుతోంది.
(చదవండి: ICC WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వికెట్ల వెనుక మనోడే)

ఐపీఎల్‌ 2023లో హార్ధిక్‌ గణాంకాలు..

  • చెన్నైపై 8 (11), 0/28
  • ఢిల్లీపై 5 (4), 0/18
  • పంజాబ్‌పై 8 (11)
  • రాజస్థాన్‌పై 28 (19), 1/24
  • లక్నోపై 66 (50), 0/7
  • ముంబైపై 13 (14), 1/10

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement