పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ సూపర్‌లీగ్ (పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న హసన్ అలీ అసభ్యకరమైన సంజ్ఞతో సైగలు చేయడం వివాదానికి దారి తీసింది. విషయంలోకి వెళితే.. శనివారం కరాచీ కింగ్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య మ్యాచ్ జరిగింది.
కింగ్స్‌మెన్ ఇన్నింగ్స్ సమయంలో అబ్బాస్ అఫ్రిది వేసిన 8వ ఓవర్‌లో ఉస్మాన్‌ఖాన్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే నిల్చున్న హసన్ అలీ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకున్నాడు. అయితే క్యాచ్ తీసుకున్న వెంటనే పెవిలియ్ స్టాండ్ వైపు తిరిగి ‘నోరు మూయండి’ అన్నట్లు సైగ చేసి ఆ తర్వాత గాల్లోకి పంచ్ విసిరాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రస్తుతం పీఎస్‌ఎల్ ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. కరాచీ కింగ్స్ తమ సొంత గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్ధంగా ఉండడం ప్రేక్షకులు లేకుండానే మాకు హాయిగా ఉంది అన్నట్లుగా అర్థం వచ్చేలా సైగలు ఉండడం వివాదంగా మారింది.
ఇక పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశంతో పీఎస్‌ఎల్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. అయితే అంతకముందు ఇన్నింగ్స్ 7.3 ఓవర్లో ఉస్మాన్ ఖాన్ ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ జారవిడిచాడు. మళ్లీ హసన్ అలీనే ఉస్మాన్ ఖాన్ క్యాచ్ తీసుకున్నాడు. చేసిన తప్పుకు ప్రాయచిత్తం చేసుకునేందుకే హసన్ అలీ ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ కింగ్స్‌మెన్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకొని విజయం సాధించింది.
- @RealHa55an signalling this to whom? 🤔 pic.twitter.com/FGOJ1TaWIP
— HAMAS 🇵🇰 (@HamasulGhani) April 11, 2026


