ఫిఫా ప్రపంచకప్ 2026లో ఒక అరుదైన ఫీట్ నమోదయ్యింది. ఆఫ్రికాకు చెందిన 10 దేశాలు ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొంటే అందులో 9 దేశాలు నాకౌట్‌కు అర్హత సాధించడం విశేషం. ఆదివారం ఉజ్బెకిస్తాన్‌పై కాంగో 3-1తో విజయం, అల్జీరియా-ఆస్ట్రియా మధ్య మ్యాచ్ (3-3) డ్రా కావడంతో ఆఫ్రికాకు చెందిన తొమ్మిది దేశాలు రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించినట్లయింది.

గతంలో ఒక ఫిఫా ప్రపంచకప్‌లో రెండుమార్లు (2014, 2022లో) ఆరు ఆఫ్రికా దేశాలు నాకౌట్ చేరడమే ఇప్పటికీ రికార్డుగా ఉంది. తాజాగా మాత్రం మొరాకో, సౌతాప్రికా, సెనెగల్, ఐవరీ కోస్ట్, ఘనా, కేప్‌వెర్డె, ఈజిప్ట్, కాంగో, అల్జీరియా నాకౌట్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించాయి. అయితే ఈసారి ప్రపంచకప్‌లో మాత్రం ఆఫ్రికా సాకర్ బలం మరింత పెరిగింది. కేప్‌వెర్డె, కాంగో లాంటి చిన్నజట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించడం చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఫుట్‌బాల్‌లో మంచి రికార్డు కలిగిన ఇరాన్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.

కేప్‌వెర్డె ఫుట్‌బాల్ జట్టు
ఇక 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన మొదటి ఆఫ్రికా దేశంగా మొరాకో చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచకప్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన మొరాకో బలమైన బ్రెజిల్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఈసారి కూడా మొరాకో సెమీస్ చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

కాంగో ఫుట్‌బాల్ టీం
2030 ఫిఫా ప్రపంచకప్‌కు మొరాకో సహ ఆతిథ్య దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాంగో, కేప్‌వెర్డె తదుపరి రౌండ్‌లో బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోనున్నాయి. లీగ్ దశలో సంచనలన ప్రదర్శన చేసిన కేప్‌వెర్డె రౌండ్ ఆఫ్ 32లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను, మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను కాంగో ఎదుర్కోనున్నాయి.
రౌండ్ ఆఫ్ 32 పోరు ఇలా..
'రౌండ్ 32'కు అర్హత సాధించిన జట్ల మధ్య సోమవారం నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. మొత్తం 16 మ్యాచ్‌ల్లో విజేతలుగా నిలిచిన టీమ్‌లు రౌండ్ 16 లేదా ప్రిక్వార్టర్స్‌లో తలపడతాయి. ఓడిన టీమ్ ఇంటిముఖం పట్టాల్సిందే. ఇక్కడ డ్రా అనే మాటే ఉండదు. నిర్ణీత సమయం, అదనపు సమయంలోగా ఎవరూ గోల్స్ చేయకపోతే.. పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
జూన్ 29: బ్రెజిల్ వర్సెస్ జపాన్, దక్షిణాఫ్రికా వర్సెస్ కెనడా
జూన్ 30: ఐవరీ కోస్ట్ వర్సెస్ నార్వే, జర్మనీ వర్సెస్ పరాగ్వే, నెదర్లాండ్స్ వర్సెస్ మొరాకో
జులై 1: ఫ్రాన్స్ వర్సెస్ స్వీడన్, మెక్సికో వర్సెస్ ఈక్వెడార్, ఇంగ్లాండ్ వర్సెస్ డీఆర్ కాంగో
జులై 2: యూఎస్ఏ వర్సెస్ బోస్నియా, బెల్జియం వర్సెస్ సెనెగల్
జులై 3: స్పెయిన్ వర్సస్ ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వర్సెస్ అల్జీరియా, పోర్చుగల్ వర్సెస్ క్రొయేషియా, ఆస్ట్రేలియా వర్సెస్ ఈజిప్ట్
జులై 4: అర్జెంటీనా వర్సెస్ కేప్ వెర్డె, కొలంబియా వర్సెస్ ఘనా
Read: ఆఖరి బంతికి సిక్స్.. గెలిపించిన భారత సంతతి క్రికెటర్


